ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం శివారు ప్రాంతంలో.. తాడి-దువ్వాడ స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్, ట్రాక్ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఈ కారణంగానే ఆగస్టు 26 నుంచి పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 26, 28, 30 తేదీల్లో విజయవాడ - విశాఖపట్నం రత్నాచల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12718), కాకినాడ-విశాఖపట్నం (17267), విశాఖపట్నం-కాకినాడ మెము ప్యాసింజర్లు (17268), రాజమండ్రి-విశాఖపట్నం (67285), విశాఖపట్నం-రాజమండ్రి (67286), విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్ (12717) రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఆగస్టు 26, 30 తేదీల్లో గుంటూరు-విశాఖపట్నం (22876), విశాఖపట్నం-గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22875) రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇటు విజయవాడ మీదుగా నడిచే రైళ్లను కూడా రద్దు చేశారు. విజయవాడ, గూడూరు సెక్షన్‌లో కొత్తగా మూడో రైల్వే లైను నిర్మాణ పనుల్లో భాగంగా నాన్ ఇంటర్ లాకింగ్ పనులతో మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 28, 29.. వచ్చే నెల 6 నుంచి 24 వరకు విజయవాడ-గూడూరు మధ్య నడిచే 67225/67226 రైళ్లను రద్దు చేశారు. ఆగస్టు 14, 17, 18 తేదీల్లో గూడూరు-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే 12709/12710 రైళ్లు రద్దయ్యాయి. ఆగస్టు 17, 18, 19 తేదీల్లో తిరుపతి-లింగంపల్లి మధ్య నడిచే 12733/12744 రైళ్లను రద్దు చేశారు.
ఆగస్టు 11 నుంచి 20 వరకు విజయవాడ-గూడూరు మధ్య నడిచే 12743/12744 రైళ్లను రద్దు చేశారు. ఆగస్టు 11 నుంచి 19 వరకు నర్సాపూర్-ధర్మవరం మధ్య నడిచే 17247/17248 రైళ్లు రద్దు చేశారు. ఆగస్టు 12 నుంచి 19 వరకు రేణిగుంట-కాకినాడ టౌన్ మధ్య నడిచే 17249/17250 రైళ్లు రద్దయ్యాయి. ఆగస్టు 13 నుంచి 20 వరకు తిరుపతి-ఆదిలాబాద్ మధ్య నడిచే 17405/17406 రైళ్లను రద్దు చేశారు. ఆగస్టు 13 నుంచి 18 వరకు తిరుపతి-విశాఖపట్నం మధ్య నడిచే 22707/22708 రైళ్లను రద్దు చేశారు. ఆగస్టు 17, 18 తేదీల్లో తిరుపతి-నర్సాపూర్ మధ్య నడిచే 07131/07132 రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను ఈ నెల 25, 26, 28 తేదీల్లో దారి మళ్లించారు.