రాష్ట్రంలో పోర్టులు, నగరాలు, క్రీడల అభివృద్ధే లక్ష్యంగా సింగపూర్లో రెండో రోజు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. పలువురు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులతో సీఎం బృందం సమావేశం కానుంది.

ఉదయం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ట్రెజరీ బిల్డింగ్లో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డా. టాన్సీలెంగ్తో చంద్రబాబు భేటీ అవుతారు. విద్యుత్తు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చిస్తారు.

8.30 ఎయిర్బస్ సంస్థ ప్రతినిధులు కృతీవాస్, వెంకట్ కట్కూరితో భేటీ.
9.00: హనీవెల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం.
9.30- 11: బిజినెస్ రౌండ్ బుల్ సమావేశం
11: ఎవర్వోల్ట్ ఛైర్మన్ మిస్టర్ సైమన్ టాన్తో భేటీ

11.30: సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ సందర్శన.
మధ్యాహ్నం 1.00: టువాస్ పోర్టు సైట్లో పర్యటిస్తారు. పోర్టు సీఈవో విన్సెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చలో పాల్గొంటారు.
సాయంత్రం 4.30: ఆంధ్రప్రదేశ్- సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోలో ప్రసంగిస్తారు.
6.00: అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీతో సమావేశమవుతారు.