నిన్నటితో సూపర్‌స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆయన్ను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా అభినందించారు. రజనీకాంత్ నటనలోని వినూత్న పాత్రలు, సామాజిక స్పృహ కలిగిన సినిమాలు ప్రజలకు చేరువయ్యాయని చంద్రబాబు ప్రశంసించారు.
చంద్రబాబు ట్వీట్‌లో, సూపర్‌స్టార్ రజనీకాంత్ గారికి 50 అద్భుత సినీ సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన సినిమాలు సమాజంపై ప్రభావం చూపాయి. ఆయనను చూసి లక్షల మంది స్పూర్తి పొందారు" అని పేర్కొన్నారు.
తనకు వచ్చిన విషెస్‌పై రజనీకాంత్ స్పందిస్తూ, "గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, మీ మాటలు నా మనసును తాకాయి. మీ ప్రేమ, మద్దతుతో ఇంకా బాగా పని చేయాలన్న ఉత్సాహం ఉంది. హృదయపూర్వక ధన్యవాదాలు" అని రిప్లై ఇచ్చారు.
అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ కూడా 50 ఏళ్ల సినీ జీవితం పూర్తి చేసిన రజనీకాంత్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మోదీ ట్వీట్‌లో,
"రజనీకాంత్ గారి ప్రయాణం అత్యంత ప్రభావవంతం. ఆయన పోషించిన పాత్రలు కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో నిలిచాయి. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాను" అన్నారు.