Praja Vedika: అదృశ్యమవుతున్న భూములు.. తెరవెనుక అసలు సూత్రధారులు ఎవరు? గ్రీవెన్స్‌లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు (ఏప్రిల్ 07 , 2026) నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమం పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్....

Published : 2026-04-06 19:00:00

తేదీ 07-04-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్ 
తేదీ: 07 ఏప్రిల్ 2026 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ పయ్యావుల కేశవ్ (గౌరవ మంత్రివర్యులు)
2. శ్రీ పీలా గోవింద సత్యనారాయణ (ఏపీ అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్)

గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలు, అధికారుల ఒత్తిళ్లు, సామాన్యుల భూముల మాయంపై నేడు టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమం.. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా సాగింది.

1. రీ-సర్వే పేరుతో మాయాజాలం (అన్నమయ్య జిల్లా):

మదనపల్లికి చెందిన రంజిత కుమారి తన కుమారుడికి ఉన్న 3.90 ఎకరాల భూమిని రీ-సర్వే పేరుతో కేవలం 19 సెంట్లుగా మార్చేశారని వాపోయారు. స్థానిక వైసీపీ నేత మాధవరెడ్డి ఒత్తిడితోనే రెవెన్యూ అధికారులు ఈ దారుణానికి ఒడిగట్టారని ఆమె ఆరోపించారు.

2. నదీ భూముల్లో ఇసుక దోపిడీ (కోనసీమ జిల్లా):

తాతముత్తాతల కాలం నాటి భూములను వైసీపీ నేతలు అక్రమంగా ఆన్‌లైన్‌లో మార్చేసి, అక్కడి నుండి ఇసుకను తరలిస్తూ కోట్లు గడిస్తున్నారని గొలకోటివారిపాలెంకు చెందిన మసేనురావు ఫిర్యాదు చేశారు.

3. రక్షించాల్సిన అధికారియే భక్షకుడైతే.. (గిద్దలూరు):

ముళ్లపొదలు కొట్టి మామిడి తోట పెంచుకున్న రైనార్డ్ అనే రైతు భూమిని, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అబ్దుల్ గఫూర్ బెదిరించి మరీ తన బంధువుల పేరు మీద రాయించుకున్న ఉదంతం కలకలం రేపింది. కోర్టు తీర్పు ఉన్నా అధికారులు స్పందించడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

4. వలస కూలీకి తప్పని వంచన (చిత్తూరు జిల్లా):

పొట్టకూటి కోసం బెంగళూరు వెళ్లిన చెంగల్రాయ రెడ్డి భూమిని పొరుగున ఉన్న వ్యక్తి ఆక్రమించి, అడిగితే ప్రాణహాని తలపెడుతున్నాడని గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్నారు.

5. ఆక్వా సంస్థల ఆగడాలు & కార్పొరేట్ ఆక్రమణలు:

కాకినాడ జిల్లాలో 'సంధ్యా ఆక్వా' సంస్థ 7 ఎకరాల భూమిని ఆక్రమించి ఇసుక తవ్వకాలు చేస్తోందని వెంకన్న దొర విన్నవించారు.

సత్యసాయి జిల్లాలో ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కంపెనీ తన తల్లి భూమిని ఆక్రమించి దౌర్జన్యానికి దిగుతోందని జగన్ మోహన్ ఫిర్యాదు చేశారు.

నేతల భరోసా:

వినతులన్నీ స్వీకరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ బాధితులకు భరోసానిచ్చారు. "గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దోపిడీపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన అధికారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుంది" అని స్పష్టం చేశారు.

భూ సమస్యలతో పాటు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య సమస్యలు మరియు నిరుద్యోగుల నుంచి ఉద్యోగ దరఖాస్తులను కూడా నేతలు స్వీకరించి, సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.

Spotlight

Read More →