Header Banner

ఆపరేషన్ సిందూర్ 2.O టైమ్ ఫిక్స్..? ఎప్పుడో తెలుసా ?

  Thu May 08, 2025 06:47        India

జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడికి భారత్​ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీసింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి అత్యాధునిక క్షిపణులతో దాడి చేసి వాటిని నామరూపాలు లేకుండా చేసింది ఇండియన్ ఆర్మీ. మే 07 అర్ధరాత్రి ఒంటిగంటా 40 నిమిషాల సమయంలో ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. ఈ దాడిలో దాదాపు 200 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. అనేక మంది గాయాలపాలైనట్లు సమాచారం. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఆపరేషన్ సిందూర్ 2.O ను చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బుధవారం(మే 08) రాత్రి ఈ దాడులు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మిగిలి ఉన్న ఉగ్ర స్థావరాల లిస్టును నిఘా వర్గాల ద్వారా తెప్పించుకుని ఈ మేరకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అతి కొద్దిసమయంలోనే ఆపరేషన్ సిందూర్ 2.O చూస్తామని ఇంటిలీజెన్స్ అధికారుల ద్వారా కూడా తెలుస్తోంది. ఇదే విషయంపై పాకిస్థాన్ నిశితంగా భారత్ అడుగులను గమనిస్తోంది. అటు పాకిస్థాన్ కూడా ఎప్పుడైనా దాడికి పాల్పడవచ్చని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్ పేర్కొన్నారు.

మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని థిల్లాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే వాళ్ల దాడి భారత పౌరులకు ప్రమాదకరం కాకపోవచ్చని.. పాకిస్థాన్ మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇక ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జైషే మహ్మద్ చీఫ్‌ మసూద్‌ అజహర్ కుటుంబసభ్యులు హతం అయ్యారు. ఆయన కుటుంబంలోని 10 మంది, మరో నలుగురు అనుచరులు మరణించినట్లు మసూద్ అజహర్ వెల్లడించాడు. 56 ఏళ్ల మసూద్ అజహర్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #OperationSindhoor2 #BreakingNews #AndhraPradeshNews #TimeFixed #SecurityAlert #BigUpdate #LatestNews