కోర్టుకు హాజరు కానందున 'బిగ్ బాస్' ఫేమ్ నటి మీరా మిథున్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని తమిళనాడు కోర్టు చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆదేశించింది. గతంలో, దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై వీసీకే ఫిర్యాదు చేసింది. దీనివల్ల మీరా మిథున్ మరియు ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
2021 ఆగస్టులో అరెస్టు అయిన తర్వాత, నెల రోజుల్లోనే వీరు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, ఆ తర్వాత మీరా మిథున్ కోర్టు విచారణలకు హాజరు కాలేదు. దీంతో 2022లో ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ అయింది. దాదాపు మూడేళ్లుగా ఆమె పరారీలో ఉన్నందున పోలీసులు ఆమెను కనిపెట్టలేకపోయారు.
అయితే, ఢిల్లీలోని వీధుల్లో తిరుగుతున్న మీరా మిథున్‌ను రక్షించమని కోరుతూ ఆమె తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ఢిల్లీ పోలీసులు మీరా మిథున్‌ను కాపాడి, ఢిల్లీలోని ఒక హోమ్‌కు తరలించినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో, ఢిల్లీలోని హోమ్‌లో ఉన్న మీరా మిథున్‌ను అరెస్టు చేసి ఆగస్టు 11వ తేదీన కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.