House: కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా?

సినీ నటి హన్సిక వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల తన భర్త సోహైల్ కతురియాతో విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వదంతులకు మరింత బలం చేకూర్చేలా హన్సిక చేసిన తాజా పని చర్చనీయాంశమైంది.

Gold rates: మళ్లీ పసిడి దూకుడు.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు భగ్గుమన్నాయి!

తాజాగా హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పెళ్లి ఫొటోలు తొలగించినట్లు అభిమానులు గమనించారు. 2022లో ఘనంగా జరిగిన వారి వివాహ వేడుక ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఫొటోలు అకస్మాత్తుగా మాయమవ్వడంతో విడాకుల వార్తలకు ఊపొచ్చింది.

Viveka murder case: సీబీఐ వివేకా హత్య కేసులో కొత్త మలుపు - సుప్రీంకోర్టులో ఉత్కంఠభరిత విచారణ! అవినాష్ రెడ్డికి గట్టి దెబ్బ..

అయితే, సోహైల్‌ను హన్సిక ఇప్పటికీ అన్ఫాలో చేయలేదు. ఇది కొంతమంది నెటిజన్లకు ఆశగా కనిపిస్తోంది. “పెళ్లి ఫొటోలు తొలగించడం ఒక ఎమోషనల్ నిర్ణయం కావచ్చు గానీ, అనుబంధం ఇంకా కొనసాగుతోంది” అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Free admissions: ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్స్... ఆ రూల్ ఛేంజ్!

వీరి మధ్య అసలేంటని ప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నప్పటికీ హన్సిక, సోహైల్ ఇద్దరూ ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారా? లేక నిజంగానే విభేదాల దశకు వెళ్లిందా? అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.

Ashwini Vaishnaw: పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడి నుంచంటే! మరికొన్ని కొత్త రైళ్లు, ప్రాజెక్టులు..

గుర్తు చేసుకుంటే, హన్సిక – సోహైల్ జంట 2022లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఎంతో వైభవంగా వివాహం చేసుకున్నారు. సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అప్పటి నుంచి వారు ప్రేమజీవితం గురించి తరచూ పోస్ట్‌లు చేస్తూ కనిపించారు.

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌..! మూడు రోజులు బ్యాంకులు బంద్‌!

ఈ విడాకుల వదంతులు నిజమా, కేవలం ఊహాగానాలా అన్నదానిపై స్పష్టత రావాలంటే హన్సిక లేదా సోహైల్ ఏదైనా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ వార్తల నడుమ అభిమానులు మాత్రం త‌మ ఇష్ట‌మైన నటి జీవితంలో ఎలాంటి గందరగోళం రాకూడదని ఆకాంక్షిస్తున్నారు.

Actress Arrest : హీరోయిన్ ను అరెస్టు చేయాలని కోర్టు సూచన! మూడేళ్లుగా ఎక్కడికెళ్లింది? ఎట్టకేలకు ఆచూకీ పట్టిన పోలీసులు!
UPI: యూపీఐ ఆల్ టైమ్ రికార్డు..! ఒక్కరోజే 70 కోట్ల లావాదేవీలు!
Anil Ambani: ఈడీ ఆఫీసుకు చేరుకున్న అనిల్ అంబానీ! మనీలాండరింగ్ కేసులో..!
Brazil: టారిఫ్‌లపై అమెరికాకు బ్రెజిల్ షాక్..! డబ్ల్యూటీఓలో సవాలుకు నిర్ణయం!