ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఉద్దేశించి బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీకి చెందిన నాయకుడినే నిలపాలని స్పష్టంగా భావిస్తోంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండకపోవచ్చని, అందుకే ప్రత్యేకంగా ఈ ఎన్నిక కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచన కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలకు తమ అభ్యర్థిని తామే నిర్ణయిస్తామని తెలియజేసింది. ఫలితంగా నితీష్ కుమార్, శశి థరూర్ లాంటి పార్టీయేతర నేతలకు అవకాశం లేకుండా తేలిపోయినట్టు బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని విదేశీ పర్యటన నుంచి తిరిగిన తర్వాత ఎన్డీఏ అభ్యర్థిపై పూర్తి స్పష్టత రావచ్చని అంచనా వేస్తున్నారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        