విజయనగరం జిల్లాలో చేపల పెంపకానికి రైతులకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. పీఎంఈజిపి (PMEGP) ద్వారా రూ.5 లక్షల వరకు loan మంజూరు అవుతుంది. ఇందులో 35 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రైతులు ఉదయ్ ఆక్వా టెక్ సంస్థను సంప్రదిస్తే, వారు 1000 కొర్రమీనులను ఉచితంగా అందించడంతో పాటు శిక్షణ, ముడిసరుకు, షెడ్డు నిర్మాణం, ట్యాంకుల ఏర్పాట్లు వంటి సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు.
ఈ చేపల పెంపక ప్రాజెక్టులో ఏడాదికి మూడుసార్లు పంట తీసుకునే అవకాశం ఉంది. శిక్షణ అనంతరం మొదట నాలుగు నెలల పాటు చేపలను ట్యాంకులో పెంచి, తరువాత 25x25 కొలతల కొలనులోకి మారుస్తారు. కంపెనీయే చేపల విక్రయాన్ని చేపడుతుంది. ఒక్క కేజీకి రూ.240 చెల్లించబడుతుంది.
ఈ project ప్రస్తుతం అగ్రహారం ప్రాంతంలోని మహిళా ప్రాంగణంలో విజయవంతంగా కొనసాగుతోంది. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ముందుగా పీఎంఈజిపి లోన్‌కు దరఖాస్తు చేసి, అనంతరం ఉదయ్ ఆక్వా సంస్థను సంప్రదించాలి.