ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతన్నలకు ఉచితంగా విద్యుత్ అందించేందుకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించింది. తొలుత ఈ పథకం ఆగస్ట్ 7వ తేదీ నాటికి ప్రారంభమవుతుందన్న వార్తలున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇది వారం ముందుగానే అంటే ఆగస్ట్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ఎన్నికల హామీని నేరవేర్చింది.
ఈ పథకం కింద చేనేత మగ్గాలున్న కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, అలాగే Power looms నిర్వహించే వారికి నెలకు 500 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందించనుంది. ఈ స్కీం వల్ల రాష్ట్రంలో సుమారు 50 వేల నేతన్న కుటుంబాలకు, 15 వేల power loom యజమానులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ.125 కోట్లు వెచ్చించనుంది.
ఆధునిక టెక్నాలజీ పెరిగుతున్న రోజుల్లో, చేతివృత్తులు దిగజారుతున్నాయి. ముఖ్యంగా నేతన్నలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తగ్గించడమే ఈ పథకం లక్ష్యం. విద్యుత్ ఖర్చు తగ్గడం వల్ల వారిపై భారం తక్కువవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
ఈ నిర్ణయం వల్ల ప్రతి చేనేత కుటుంబానికి నెలకు సుమారు రూ.950 నుంచి రూ.1250 వరకు ప్రయోజనం కలుగనుంది. Power loom యజమానులకు ఇది నెలకు రూ.2,500 వరకు లాభం ఇవ్వనుంది. పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంత్రి సవిత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చేతివృత్తుల పరిరక్షణకు ఇదొక దిశానిర్దేశకమైన ప్రయత్నంగా భావిస్తున్నారు.