World Cup: హంపీ విజయం స్ఫూర్తిదాయకం.. శాప్ ఛైర్మన్ ప్రశంసల వర్షం!

ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు ‘జీరో ఫేరో టిక్కెట్‘ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

Adaptive Learning: ఏపీలో వినూత్న కార్యక్రమం..! చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఏఐ బోధన!

ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు... ఉచిత ప్రయాణంతో ఎంతమేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి... 100 శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ... వంటి వివరాలు ఆ టిక్కెట్‌లో పొందుపరచాలని చెప్పారు. జీరో ఫేర్ టికెట్‌ ఇవ్వడం ద్వారా ఎంత లబ్దిపొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులు అందరికీ సులభంగా తెలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

Intercity Express: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఆ రైలుకు అదనపు బోగీలు..! ఇక నో టెన్షన్..!

ఇందుకు సంబంధించి సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.

Highway Extension: కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఆ 15 జిల్లాల రహదారులకు మారనున్న రూపురేఖలు!

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ ఏ రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడింది... మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో పథకాన్ని ఆగస్టు 15 నుంచి సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

Outsourcing wages: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – మున్సిపల్ ఔట్సోర్సింగ్ వేతనాలకు పెంపు

ఆర్టీసీని లాభాల బాట పట్టించండి:

Air India: రన్ వే పైనుంచి పక్కకి జారిపోయిన ఎయిరిండియా విమానం! భారీ వర్షం కారణంగా..!

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండా... ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణా వ్యయం తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Koneru Humpy: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి! ఉమెన్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు చేరి తొలి మహిళగా రికార్డ్!

లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి.. ఎటువంటి విధానాలు తీసుకురావాలి... అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు.

Green Card: అభివృద్ధికి అడ్డుగా వలస నిబంధనలు..! గ్రీన్ కార్డు జాప్యం మరోసారి కెరీర్ పై దెబ్బ!

ప్రస్తుతం ఉన్నవాటిని ఎలక్ట్రికల్ బస్సులు గా మారిస్తే నిర్వహణా వ్యయం తగ్గుతుందని... అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైనా అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

Rajyasabha: రాజకీయ ఉత్కంఠ! జస్టిస్ వర్మ అభిశంసన దిశగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ సమాఖ్య!
Narayana Speech: రాజధాని అభివృద్ధిలో దూసుకుపోతున్న ప్రభుత్వం.. భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!