International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

Andhra Pradesh: పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ప్రతి రైతుకి న్యాయం జరుగుతుంది...రాజకీయ విభేదాలు వద్దు అధికారులు కి సీరియస్ వార్నింగ్!

2025-10-31 17:33:00

మొంథా తుఫాను కారణంగా కాకినాడ జిల్లాలో పలు తీరప్రాంత గ్రామాలు, రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. పంటలు, ఇళ్ల నిర్మాణాలు, ఇతర ఆస్తులు పాడై ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందిస్తూ, ప్రతి ఒక్కరికి న్యాయం జరగడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పంట నష్టం, ఆస్తి నష్టం పకడ్బందీగా అంచనా వేసి, ఆ ఆధారంగా రైతులకు తగిన పరిహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

తీర ప్రాంత గ్రామాల్లో భద్రత రక్షణకు బృహత్ ప్రణాళిక రూపొందించడం జరుగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితిని పరిశీలించి, తక్షణ సహాయ చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఏలేరు కాలువ గట్టు పటిష్టతకు సంబంధించిన సమస్యలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. మల్లవరం ప్రాంతంలోని పత్తి రైతులు ఎదుర్కొన్న నష్టానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఈ నేపథ్యంలో, కాకినాడ జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపానా అనంతర ఉపశమన చర్యలపై దిశానిర్దేశం ఇచ్చారు. ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం, పునరుద్ధరణ కార్యక్రమాలు, భవిష్యత్తులో ప్రకంపనలకు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం ముఖ్యమని స్పష్టంగా తెలిపారు.

రైతులు తీర ప్రాంత ప్రజల భవిష్యత్తు సురక్షితం కావడం కోసం ప్రభుత్వం అన్ని సాధ్యమైన మార్గాలను అన్వేషిస్తుందని ప్రతి ఒక్కరికి న్యాయం జరగడం, పునరుద్ధరణ చర్యలు వేగంగా అమలు కావడం ప్రధాన ఉద్దేశ్యం అని చెప్పుకొచ్చారు. ఇటువంటి  తీవ్ర పరిస్థితిలో పార్టీ వ్యత్యాసాలు చూపించకూడదని  కూటమి ప్రభుత్వం అందరికీ సమానమైన న్యాయం చేస్తుందని  చెప్పుకొచ్చారు

Spotlight

Read More →