International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

Air India: ఎయిర్ ఇండియా విమానంలో కలకలం..! గంటపాటు లోపలే చిక్కుకున్న ప్రయాణికులు!

2025-08-11 14:47:00
Tesla: భారత్‌లో టెస్లా వేగం..! రెండవ షోరూమ్‌తో సేల్స్, సర్వీస్ వేగవంతం!

రాయ్‌పూర్‌లో ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు ఊహించని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ నుంచి రాయ్‌పూర్ చేరుకున్న ఏఐ 2797 విమానం ల్యాండ్ అయిన తర్వాత డోర్ సాంకేతిక సమస్య కారణంగా తెరుచుకోకపోవడంతో, ఓ ఎమ్మెల్యే సహా 160 మందికి పైగా ప్రయాణికులు గంటకు పైగా విమానంలోనే ఇరుక్కుపోయారు. ఈ ఘటన ఆదివారం రాత్రి స్వామి వివేకానంద విమానాశ్రయంలో కలకలం రేపింది.

Film producers meet: మంత్రి కందుల దుర్గేశ్‌తో సినీ నిర్మాతల భేటీ.. సీఎం, డిప్యూటీ సీఎంకు!

వివరాల ప్రకారం, విమానం రాత్రి 8:15కి ఢిల్లీలో బయలుదేరి, 10:05కి రాయ్‌పూర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. కానీ, ల్యాండింగ్ తరువాత డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ఈ విమానంలో బిలాస్‌పూర్ జిల్లా కోట నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అటల్ శ్రీవాస్తవ కూడా ఉన్నారు.

Dacheppali Incident: దాచేపల్లి ఘటనపై ప్రభుత్వం సీరియస్.. హాస్టల్ వార్డెన్‌తో పాటు వాచ్‌మన్‌పై వేటు!

దాదాపు గంటపాటు డోర్లు మూసివేయబడటంతో పాటు, సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగించింది. ఇదే సమయంలో విమానంలో పవర్ సప్లై నిలిచిపోవడం భయాన్ని మరింత పెంచింది. “ఇటీవలి విమాన ప్రమాదాల తర్వాత ఈ పరిస్థితి మాకు మరింత భయానకంగా అనిపించింది,” అని ఒక ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు.

AP Temples: ఏపీ సర్కార్‌ విప్లవాత్మక నిర్ణయం! తిరుమల తరహాలో, ఇకపై అక్కడ కూడా! అనాదిగా వస్తున్న సంప్రదాయాలకు..

తరువాత సిబ్బంది స్పందించి, ఇది కేవలం సాంకేతిక లోపమేనని వివరణ ఇచ్చారు. అయితే, కొంతమంది అధికారులు ఇది భద్రతా డ్రిల్‌లో భాగమని చెప్పడంతో గందరగోళం మరింత పెరిగింది. చివరికి రాత్రి 11 గంటల తర్వాత సమస్యను పరిష్కరించి, ప్రయాణికులందరినీ సురక్షితంగా దిగిపోవడానికి అనుమతించారు.

Rahul Gandhi: ఉద్రిక్త వాతావరణం! ఈసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తూ రాహుల్ గాంధీ నిర్బంధం!

ఈ ఘటనపై డీజీసీఏ సోమవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ, ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక లోపాలు, ప్రయాణికులకు సమయానికి సమాచారం అందించడంలో విఫలమవుతున్న తీరు విమర్శలకు కారణమవుతోంది.

TCS: టీసీఎస్‌లో భారీ లేఅఫ్లు..! కొత్త డిజిటల్ నైపుణ్యాలు తప్పనిసరి!
Moosi River: మూసీ నది చరిత్ర, ప్రత్యేకతలు! వీకెండ్ ట్రిప్ కు బెస్ట్ ప్లేస్!
Maruti Car Offer: మీ కలల కారు ఇప్పుడు మరింత చేరువలో - లక్షకు పైగా మెగా డిస్కౌంట్! ఇంతకంటే మంచి అవకాశం రాదు!
AI: యూట్యూబ్ ఫేస్‌బుక్ గూగుల్.. అంతా ఏఐ ఆధారితమే!
ED: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు! ఈడీ ముందు రానా హాజరు!

Spotlight

Read More →