ప్రధాని సభలో పోలీసు అధికారుల వైఖరిని సీరియస్ గా తీసుకున్న NDA పార్టీలు
విధులకు వచ్చిన నలుగురు ఎస్పీలపై కేంద్రానికి, బిజెపి పెద్దలకు ఫిర్యాదు
ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులకు సభ విధుల వెనుక కుట్ర ఉందని నివేదిక
సత్యసాయి జిల్లా నుంచి ప్రత్యేకంగా ఎస్పీని బందోబస్తుకు పిలిపించడాన్ని ప్రస్తావిస్తూ ఫిర్యాదు
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అమరావతి:-ప్రధాని పాల్గొన్న ఎన్డిఎ సభ ను ఎలాగైనా విఫలం చేయాలనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం పోలీసులను ముందు పెట్టి చేసిన కుట్ర బహిర్గతం అయ్యింది. దీంతో మొత్తం వ్యవహారంపై మూడు పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు, బిజెపి కేంద్ర నాయకత్వానికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. పోలీసుల సహాయ నిరాకరణ, సభకు జనం చేరుకోకుండా అడ్డంకులు సృష్టించిన వైనంపై పూర్తి వివరాలతో నివేదిక ద్వారా ఫిర్యాదు చేశారు.
1.MadhavaReddy,SP,SatyaSai Dist -Incharge for Helipad, 2.ParameswarReddy,SP,Prakasam—-Incharge for Traffic, 3.ThirumaleswarReddy,SP,Nellore—-Incharge for Public Galleries, 4.RaviSankarReddy,SP,Palnadu—Overall Incharge గా నియమించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇలా నలుగురు పోలీసు అధికారులు ఒకే వర్గానికి చెందిన వారిని పిలిపించడం వెనుక వైసీపీ వ్యూహం ఉందని...పార్టీ కుట్రను వీళ్లు అమలు చేశారని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీనికి అవసరం అయిన ఆధారాలు, ఘటనలను కూడా ఆ రిపోర్ట్ లో పొందు పరిచారు. ఉద్దేశ్య పూర్వకంగా ఎలా ఆ అధికారులు సభను దెబ్బతీసే ప్రయత్నం చేశారో స్పష్టంగా పేర్కొన్నారు. కార్యక్రమాన్ని చెడగొట్టాలనే ఉద్దేశ్యంతో వాహనాలను 8 కిలోమీటర్ల దూరంలోనే నిలిపి కార్యకర్తలను సభకు వెళ్లకుండా అడ్డుకున్నరు.
ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!
మరోవైపు ట్రాఫిక్ నియంత్రిచని కారణంగా లక్షల మంది సభా ప్రాంగణానికి చేరుకోలేక పోయారు. గ్యాలరీ లకు ఇంచార్జ్ గా ఉన్న తిరుమలేశ్వర రెడ్డి కూడా తన విధుల్లో పూర్తిగా విఫలం అయ్యారు. మైక్ సిస్టం వద్ద తోపులాను కనీసం నివారించే ప్రయత్నం చేయలేదు. స్వయంగా ప్రధాని పిలిచినా పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోలేదు. తోపులాటను నివారించలేదు. జనాన్ని అదుపుచేయలేదు. అలాగే అక్కడ విధుల్లో ఉన్న ఇతర ఎస్పీలు కూడా తమ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించలేదు. మాజీ సిఎం చంద్రబాబు నాయుడు CSOను కూడా ఆయన దగ్గరకు అనుమతించలేదు.
మోదీ ప్రసంగం అంతరాయంపై మల్లగుల్లాలు పడుతున్న పోలీసులు!! విధి నిర్వహణలో ఉండాల్సిన ఎస్పీ కారులో!!
మరోవైపు ప్రధానికి ఇచ్చేందుకు తెచ్చిన జ్ఝాపికలను కూడా పైకి పంపలేదు. ఎస్పీజీ సిబ్బంది నుంచి అనుమతి వచ్చిన తరువాత కూడా శాలువాలు, జ్ఝాపికలు పైకి పంపకుండా అడ్డుకున్నారు. ఇలా ఎవరి పరిధిలో వారు సభకు ఇబ్బందులు సృష్టించారు. దీంతో అన్ని అంశాలను ప్రస్తావిస్తూ...అటు కేంద్ర పెద్దలకు, బిజెపి జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నలుగురు అధికారులతో పాటు తెరవెనుక ఉండి కథనడిపిన ఇంటలిజెన్స్ ఉన్నతాధికారిపైనా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఖమ్మం ఎంపీ సీటు టీడీపీకి? వ్యతిరేకిస్తున్న బీజేపీ!!
గవర్నర్ తొలగించక ముందే రాజీనామా చెయ్యి! గౌతమ్ సవాంగ్ కు తీవ్ర హెచ్చరిక! తప్పు చేసినా బొకాయింపు
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!
వైసీపీ కొత్త ప్లాన్!! 30 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్న జగన్!!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి