డబ్బుల ATM చూశారు. గోల్డ్ ఏటీఎంను చూశారు. పిజ్జా ఏటీఎం కూడా వచ్చేసింది. కేవలం మూడే మూడు నిమిషాల్లో వేడి వేడి పిజ్జా మనకందించే ఏటీఎం. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి స్పీడీ పిజ్జా మెషిన్ ఇది. చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సు సమీపంలో ఇది కొలువు దీరింది. యమ్మీ యమ్మీ పిజ్జా కేవలం 3 నిమిషాల్లో డెలివరీ అవుతుంది. ఈ ప్రత్యేకమైన ఆలోచన ఫ్రాన్స్ ప్రేరణగా వచ్చిందని ఐమ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లైసెన్స్ పొందిన డాక్టర్ రోహిత్ శర్మ వెల్లడించారు.
ఇంకా చదవండి: నేటి నుంచి సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు! 39 లక్షల మందికిపైగా విద్యార్థులు..
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
గత నెలలో దీన్ని ఇన్‌స్టాలేషన్ చేసినప్పటినుంచీ విపరీతమైన ప్రజాదరణ పొందిందన్నారు ఆయన. ప్రస్తుతం రోజుకు సగటున 100 దాకా ఆల్ వెజిటేరియన్ పిజ్జాలను సిద్ధం చేస్తోంది. వారాంతాల్లో, ఈ సంఖ్య 200-300 మధ్య ఏదైనా పెరుగుతుంది. ఇది కేవలం మొట్టమొదటిది, కొత్తదనంతో కూడుకున్నది మాత్రమే కాదని, డొమినోస్, పిజ్జా హట్ లాంటి వాటితో పోలిస్తే దాదాపు 35శాతం తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. త్వరలోనే మరిన్ని ప్రధాన నగరాల్లో దీన్ని ఇన్‌స్టాల్ చేస్తామని చెప్పారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి