Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు!

చరిత్రలో తెలుగువారి స్థానం అజరామరం ... నేడు జ్ఞానవాపి శాసనాల్లో కూడా అదే!!

2024-02-01 07:36:00

జ్ఞానవాపి మసీదు మందిరం వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. మసీదు ఆవరణలో హిందువులు పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు భక్తులు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్కడ పూజలు నిర్వహించడానికి శ్రీ కాశీవిశ్వనాథ ఆలయ ట్రస్ట్ నామినేట్ చేసిన పూజారికి అవకాశం కల్పించాలని కోర్టు రిసీవర్ ను ఆదేశించింది.ఈ క్రమంలోనే స్పందించిన కాశీ విశ్వనాథ్ ట్రస్ట్.. ఈ కేసులో ఇది అతిపెద్ద విజయమని పేర్కొంటూ.. వారం రోజుల్లో జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివుడికి పూజలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

ఇటీవలె జ్ఞానవాపి ప్రాంగణంలో సర్వే నిర్వహించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా.. ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో ఒక భారీ హిందూ ఆలయం ఉండేదని.. దాన్ని కూల్చి వాటి శిథిలాలతో మసీదు నిర్మించారని నివేదికను వెలువరించింది.

ఈ మసీదులోని గోడలపై తెలుగు శాసనాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. మొత్తం మూడు శాసనాలను తెలుగులో రాసి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు మైసూరులోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేసింది.దీనిపై ఓ నివేదికను రూపొందించింది.

ఈ శాసనాలు 12 నుంచి 17వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. కాలక్రమేణా అవన్నీ ధ్వంసమైనట్లు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ మూడు శాసనాల్లో ఒకదాంట్లో నారాయణభట్లు, ఆయన కుమారుడు మల్లన్నభట్లు పేర్లు కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారణాశిలో వెలిసిన కాశీ విశ్వనాథుడి ఆలయ నిర్మాణ పర్యవేక్షణ కోసం తెలుగు బ్రాహ్మణుడు నారాయణభట్లు 15వ శతాబ్దంలో ఆయన అక్కడికి వెళ్లారని ఈ శాసనాల్లో రాసి ఉంది.  

వీరు 1585లో కాశీవిశ్వనాథుని ఆలయ పునః నిర్మాణ పనులను పర్యవేక్షించారు. 15వ శతాబ్దంలో జౌన్పూర్ సుల్తాన్ హుస్సేన్ షార్కి కాశీవిశ్వనాథుని మందిరాన్ని కూల్చేశారు. తర్వాత కాలంలో రాజ్యం చేపట్టిన రాజా తోడరమల్లు ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించారు. దక్షిణ భారత దేశానికి చెందిన నిపుణులైన నారాయణ భట్టును సంప్రదించి ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారని చరిత్రకారులు చెబుతుంటారు.

నారాయణ భట్టు పర్యవేక్షణలోనే కాశీ విశ్వనాథుని మందిరం పునర్నిర్మితమైంది. అలాగే మసీదు లోపల దొరికిన రెండవ తెలుగు శాసనంలో 'గోవి' (గొర్రెల కాపరి) అని ఉంది. మూడవది, మసీదు ఉత్తర ద్వారం వద్ద 15వ శతాబ్దానికి చెందినది, 14 పూర్తిగా అరిగిపోయిన పంక్తులు ఉన్నాయి.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ నివేదిక వెలువడిన తర్వాత మసీదు లో సీల్ చేసి ఉన్న ప్రాంతాన్ని కూడా తవ్వి, సంపూర్ణంగా మసీదు ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు సుప్రీంకోర్టును మంగళవారం ఆశ్రయించారు. గతంలో అక్కడ శివలింగం ఉందని, అందువల్ల ఆ శివలింగానికి ఎలాంటి నష్టం కలిగించకుండా, ఆ శివలింగం చుట్టూ నిర్మించిన కృత్రిమ ఆధునిక గోడలు అంతస్తులను తొలగించాలని వారు సుప్రీంకోర్టును కోరారు. అలాగే, అక్కడ లభించిన శివలింగం స్వభావాన్ని, చరిత్రను నిర్ణయించడానికి శివలింగం చుట్టూ ఏఎస్ఐ శాస్త్రీయ పద్ధతుల్లో అవసరమైన తవ్వకాలు చేపట్టాలని వారు కోరారు. ఆ మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన మరుసటి రోజే జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ ఆదేశాలపై హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →