పతంజలి అడ్వర్టైజ్ మెంట్ల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, పతంజలి సంస్థకు చెందిన 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్ ను రద్దు చేశామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈమేరకు దేశ అత్యున్నత కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో వివరాలు వెల్లడించింది.
ఇంకా చదవండి: ఓరి దేవుడా! ఏంట్రా ఇది నిజమే.. చికెన్‌కు రెండింతల ధర పలుకుతున్న చింతచిగురు!
సదరు ఉత్పత్తుల తయారీపై బ్యాన్ విధిస్తూ దివ్య ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కు ఈ నెల 15న ఆదేశాలు జారీ చేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ లైసెన్సింగ్ అథారిటీ కోర్టుకు తెలిపింది. దీంతోపాటు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ లపై హరిద్వార్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కు క్రిమినల్ కంప్లైంట్ చేసినట్లు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. తయారీ బ్యాన్ విధించిన ఉత్పత్తులు ఇవే..దృష్టి ఐ డ్రాప్, స్వసరి గోల్డ్, స్వసరి వాటి, బ్రొన్‌కమ్, స్వసరి ప్రవాహి, స్వసరి అవాలెహ్, ముక్తా వాటి ఎక్స్‌ట్రా పవర్, లిపిడామ్, బీపీ గ్రిట్, మధుగ్రిట్, మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్, లివమ్రిత్ అడ్వాన్స్, లివొగ్రిట్, ఐగ్రిట్ గోల్డ్.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: