Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..!

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలు, పురస్కారాలు!

2024-04-24 13:50:00

రచయిత: కాపెర్ల పవన్ కుమార్, 9908300831

మోపిదేవి
కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. మోపిదేవి లోని వల్లీ, దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం దక్షిణభారత దేశం లోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం గా విరాజిల్లుతోంది. స్కాందపురాణం లోని సహ్యాద్రిఖండం లో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భం లో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది.

అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరి స్థితుల్లో కాశీని విడిచిపెట్టవలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశం లోకి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించసాగింది. ప్రకృతి స్థంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపోయాయి. ఈ మహోపద్రవాన్ని నివారించ గలిగేది అగస్త్యమహర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమహర్షికి విషయాన్ని వివరించారు.

యోగదృష్టితో మొత్తం తెలుసుకున్న మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు. లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో ఉన్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.

పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళ ఆంద్రమహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు. “వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్” అనేమాట అప్రయత్నంగా మహర్షి నోటి నుండి వెలువడింది. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయనను అనుసరించారు. ఒకపుట్టనుండి దివ్యతేజస్సుని గమనించి, ఇదే సుబ్రమణ్య క్షేత్రమని ఇది భుక్తికి, ముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించాడు అగస్త్యుడు.

కుమారస్వామి ఉరగ (పాము) రూపం లో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరించారు అగస్య్త మహర్షి. “సనక, సనకస, సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు, పైగా దిగంబరులు. వారు ఎల్లప్పుడూ భగవదారాధన లోనే కాలం గడుపుతుంటారు. వారు ఒకసారి పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయం లో పరమేశ్వరుడు కైలాసం లో లేడు. లోకమాత పార్వతి, కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయంలో శచీ, స్వాహా మొదలైన దేవతాస్త్రీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాల తో సుందరీమణులను చూచి కుమారస్వామి నవ్వు ఆపుకోలేకపోయాడు.

“కుమారా! ఎందుకు నవ్వుతున్నావు? వారు నాలాగా కన్పించలేదా? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? ఏదైనా తేడా కన్పించినదా?” అని పార్వతి కుమారుని ప్రశ్నించింది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపై పడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్నా వినకుండా, పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపం తో తపస్సు ప్రారంభించాడు.

ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టి తో చూచి శిష్యుల వివరించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు. “అత్రస్నానం తు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్” అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్రతో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి.

కాలాంతరం లో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపం లోనే కుమ్మరి కులస్తులు కులవృత్తితో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఇతను మహాభక్తుడు. అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి, ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. తనవృత్తిని స్వామికి అంకితం చేశాడు. మట్టి తో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయం లో భద్రపరచేవాడు. అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయం లో శిథిలమై పోగా మిగిలిన నంది, గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపం లో భద్రంగా ఉండి, భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు.

ఆలయప్రత్యేకత: స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడి లో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామి కి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధం గా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రం లో పాలుపోయడం జరుగుతుంది. ఆలయ ప్రదక్షిణ మార్గం లో ఉన్న పుట్టనుండి గర్భగుడి లోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.

ఇక్కడ స్వామి వారి ఆలయం లో పుట్టలో పాలుపోయడం విశేష సేవ గా భక్తు లు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు.

స్వామి వారి ఆలయం లో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం , అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీరమ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించు కుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.

విశేష పూజలు: నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాల తోపాటు ఆదివారం, గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు. స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం తో పాటు ప్రత్యేకఅర్చనలు జరుగుతాయి. ఆలయం లో ప్రతి రోజు స్వామి వారికి శాంతి కళ్యాణం జరుగుతుంది. ప్రతి నెలా వచ్చే కృత్తికానక్షత్రం రోజున రాహు, కేతువు, సర్పదోష నివారణకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉగాది ప్రవదినం, దసరా శమీపూజ, కార్తీక దీపోత్సవం, ఆరుద్రోత్సవము విశేషంగా జరుగుతాయి. మాఘమాసం లో కళ్యాణోత్సవం, రథోత్సవం, వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్ధం నిత్యాన్నదాన పథకం ఇటీవలె ప్రారంభించబడింది నాగదోషాలకు, సంతాన రాహిత్యా నివారణకు, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనే తరుణోపాయం గా శాస్త్రాలు చెపుతున్నాయి.

రచయిత: కాపెర్ల పవన్ కుమార్

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

యాత్రా తరంగిణి - దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలిదర్శనం చేసుకునే సమయం లో చేయవలసినది ఏమిటిప్రముఖ దేవాలయాల ప్రాముఖ్యతవిశిష్టతవిశేషాలు... వారం వారం మీకోసం... 

యాత్రా తరంగిణి 17: 2500 ఏళ్ల చరిత్ర ఉన్న పాండ్యుల కాలంనాటి... మధురై మీనాక్షి ఆలయం! గోపురం అనే పదం ఆవిర్భవించింది అక్కడే! 

యాత్రా తరంగిణి 16: రాముడి పాపాలను ప్రక్షాళన చేసిన లింగం! రామేశ్వర క్షేత్రం యొక్క విశేషాలు! 

యాత్రా తరంగిణి 15: కోటానుకోట్ల విలువచేసే పసిడి, వజ్ర, వైఢూర్యాలు! అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు! 

యాత్రా తరంగిణి 14: 41 రోజులు కఠిన దీక్ష! మకర జ్యోతి దర్శనం! ఎంతో ప్రసిద్ధి చెందిన శబరిమల క్షేత్రం! 

యాత్రా తరంగిణి 13: హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా భావించే శబరిమల - ఎరుమేలి శ్రీ ధర్మ శాస్తా ఆలయం! అసలు కథ ఏమిటి?

యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్‌ ఆలయ ప్రత్యేకతలు!

యాత్రా తరంగిణి 11: కుబేరుడు పతిష్టించిన లింగం! బంగారు ఊయల! ఎన్నో విశిష్టతలు! భవానీ ఆలయం! 

యాత్రా తరంగిణి 10: దగ దగా మెరిసిపోయే కాంతులతో మహాలక్ష్మి అమ్మవారు! వేలూరు గోల్డెన్ టెంపుల్
 

యాత్రా తరంగిణి 9: వేల ఏళ్ళ చరిత్ర ఉన్న కాణిపాక క్షేత్రం! విశేషాలు! పూజా విధానాలు!

యాత్ర తరంగిణి 8: దేవాలయాలకు రాతి గడప ఎందుకు ఉంటుంది! ఆ గడపను తొక్కవచ్చా? ప్రదక్షణం వెనకున్న పరమార్ధం!

యాత్ర తరంగిణి 7: ఆలయం లోపల భాగంలో ఉండే ప్రదేశాలు! వాటి విశిష్టత!

యాత్ర తరంగిణి 6: దేవాలయాల ఎప్పుడుఎక్కడ ప్రతీష్టించాలిశాస్త్రం ఏం చెబుతుంది?

యాత్రా తరంగిణి 5: ప్రతి దేవాలయం ఎందుకు అలా ఉంటుందిసైన్స్ దాగుందా?

యాత్రా తరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం

యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు

యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలువాటి నిర్మాణాలు ఎలా ఉంటాయిఉపయోగాలు ఏమిటి...

యాత్రా తరంగిణి 1 -గుడి లో సాష్టాంగ నమస్కారంప్రదక్షిణం తప్పనిసరా... 

Spotlight

Read More →