తెలుగు వెలుగు, అక్షర యోధుని అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నాను. తెలుగువారి ఆత్మబంధువు రామోజీగారికి కడసారి వీడ్కోలు పలికాను. హృదయం బాధతో నిండిపోయింది. ఈనాడు ఆయన మన మధ్య లేకపోయినా, ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఉషాకిరణాల్లాంటి ఆయన కీర్తి అనునిత్యం అజరామరమై వెలుగుతుంది అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
తెలుగువారి ఆత్మబంధువు రామోజీగారికి కడసారి వీడ్కోలు! చంద్రబాబు ట్వీట్!
