అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఓ వృద్ధుడు అనూహ్య ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఒకేసారి తుమ్మూ, దగ్గూ రావడంతో ఆయన పొట్ట చిట్లి పేగులు బయటకు వచ్చాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆయనను కాపాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, వృద్ధుడికి అంతకుమునుపే ఉదర భాగంలో ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలో వైద్యులు ఉదరంపై కోతపెట్టి ఆపరేషన్ చేశారు. అనంతరం గాయానికి కుట్లు వేశారు. ఆపరేషన్ తాలుకు గాయం నుంచి వృద్ధుడు పూర్తిగా కోలుకోలేదు. ఇటీవల ఓ రెస్టారెంట్‌లో ఆయన భోజనం చేస్తుండగా ఉదరభాగంపై తడిగా ఉన్నట్టు అనిపించింది.
ఈలోపు తుమ్మూ, దగ్గు రావడంతో ఆపరేషన్ గాయం ఉన్న చోట కడుపు చిట్లి పేగులు బయటకు వచ్చాయి. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఉదరం, పొత్తికడుపు భాగంలో ఆపరేషన్లు అయిన వారికి ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆపరేషన్ తాలూకు గాయాలు మానకపోతే తుమ్మూ, దగ్గుతో ఈ పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. శస్త్రచికిత్సల తరువాత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గాయాలు మానకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఇంకా చదవండి: వైఎస్సార్ సీపీ భారీ ఓటమికి దారితీసిన 13 కారణాలు! విశ్లేషించిన ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ ఎన్డీటీవీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: