ముద్దులొలుకుతున్న తొమ్మిది నెలల చిన్నారికి ప్రాణాంతక వ్యాధి. అయితే ఒక్క ఇంజక్షన్ ద్వారా ఆ బిడ్డను బతికించుకోవచ్చు. కానీ వచ్చిన సమస్యల్లా ఆ ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు. ఒక మధ్యతరగతి కుటుంబానికి అంత స్తోమత ఉంటుందా? రాజమండ్రిలో ఉంటున్న ప్రీతమ్, గాయత్రి దంపతుల కూతురు హితైషి 'స్పైనల్ మస్క్యూలర్ ఆట్రోఫీ' అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. వెంటనే ఆ పాపకు 'జొల్ జెన్ స్మా' అనే ఇంజెక్షన్ ఇచ్చి చికిత్స చేయకపోతే ప్రాణాలు దక్కడం కష్టం. బిడ్డ పరిస్థితి తెలిసి తల్లడిల్లిన తల్లిదండ్రులు కూతురి ప్రాణాలు దక్కించుకోడానికి రూ.16 కోట్ల సాయం కోసం దాతలను ప్రాధేయపడుతున్నారు. హితైషి విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వం తరపున కొంత సాయం అందించేందుకు మాటిచ్చి, మిగిలిన సాయం అందించి ఆదుకోవాల్సిందిగా ప్రజలకు, ఎన్జీవోలకు, కార్పొరేట్ సంస్థలకు పిలుపునిచ్చారు.
కొంతమంది స్పందించి సాయం అందించినప్పటికీ రూ.16 కోట్లు చాలా పెద్ద మొత్తం కావడంతో ఇంకా భారీగా సాయం అందాల్సి ఉంది. మరోవైపు పాప పరిస్థితి రోజురోజుకూ విషమిస్తుంది. కాబట్టి దాతలకు మరోసారి పిలుపునిస్తోంది తెలుగుదేశం. హితైషిని ఆదుకునేందుకు భారీ విరాళాలను అందించమని కోరుతున్నారు. ఇలాంటి వారికి క్రౌడ్ ఫండింగ్ సేకరించి ప్రత్యేకంగా అండగా నిలిచేందుకు ఇంపాక్ట్ గురు అనే వెబ్ సైట్ ద్వారా విరాళాలను సేకరిస్తున్నారు. ఈ వెబ్ సైట్ వేదికగా అందించిన విరాళాలు నేరుగా ఆసుపత్రికి వెళ్తాయి.
కాబట్టి దాతలు హితైషి కోసం ఆర్థిక సాయం అందించవచ్చు. దాతలు సహృదయంతో స్పందించి హితైషిని రక్షించుకునేందుకు తమ విరాళాలను అందించవలసిందిగా తల్లితండ్రులు కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం కింది నెంబర్ లను సంప్రదించవచ్చు: 7794024001, 8919189067
భారత్ నుండి సహాయం చేయాలి అనుకునే దాతలు
యూకే నుండి సహాయం చేయాలి అనుకునే దాతలు
అమెరికా నుండి సహాయం చేయాలి అనుకునే దాతలు
ఆ చిన్నారి బతకాలి అంటే అందరూ ముందుకు వచ్చి సహాయం చేయాలి. ఈ బిడ్డ బ్రతకడం కోసం మీకు తోచినంత ఆర్థిక సహాయం చేయవలసిందిగా ఆంధ్రప్రవాసి తరఫు నుండి కోరుతున్నాము.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో స్విమ్మింగ్ పూల్‌లో పడి తెలుగు స్టూడెంట్ మృతి! అతడి స్నేహితుడితో పాటు..
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! మాజీ ఎమ్మెల్యే రాజీనామా!
కుప్పంలో కౌంట్ డౌన్ - వైసీపీ కీలకనేత అందర్! చంద్రబాబుతో పెట్టుకుంటే అంతే!
బీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు! అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 58 ఏళ్ల తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేసిన కేంద్రం!
తహసీల్దారుల బదిలీ ప్రక్రియపై సీరియస్ హెచ్చరికలు జారీ! ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ వార్తలపై స్పందించిన CCLA!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: