ప్రస్తుతం చాలామంది వయసుతో సంబంధం లేకుండా కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు చిన్నవయసులోనే చాలామందిని కీళ్ల నొప్పుల బారిన పడేస్తున్నాయి. అయితే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందాలంటే ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి ఆహారాలు తింటే కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కీళ్ల నొప్పులను తగ్గించే సూపర్ ఫుడ్స్ గా బెర్రీస్ ను చెప్పుకోవచ్చు. స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు, బ్లూబెర్రీల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను వాపులను తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గించే వాటిలో పసుపు కూడా చాలా ముఖ్యమైనది.. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటు వాపును తగ్గించే లక్షణాలు కలిగి ఉంటుంది. కీళ్లనొప్పి, కండరాలు పట్టేయడం, వాపులను తగ్గించడంలో పసుపును ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో అల్లం చాలా బాగా పనిచేస్తుంది.యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కలిగిన అల్లంలో అనేక ఔషధగుణాలు ఉంటాయి. ఇది కండరాల నొప్పులను, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆకుపచ్చని ఆకుకూరలు తింటే మంచిది. ఆకుకూరల్లో అనేక పోషకాలు ఉంటాయి. పాలకూర, బచ్చలి కూర, బ్రోకలీ వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు కూడా ఉంటాయి. కీళ్ల నొప్పులను తగ్గించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది.
ఇంకా చదవండి: వర్షాకాలం రోగాలతో జర జాగ్రత్త! ఈ 5 ఆహార శుభ్రత చిట్కాలు పాటిస్తే ఎంతో మేలు!
వర్షాకాలంలో దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉత్తేజం కూడా కలుగుతుంది ఇక కీళ్ల నొప్పులను తగ్గించే దివ్య ఔషధంగా వెల్లుల్లిని చెప్పవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కాంపౌండ్లు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. కీళ్లల్లో రక్త ప్రవాహాన్ని చక్కబెడతాయి. కండరాలు పట్టెయ్యకుండా చూస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గించడానికి డ్రై ఫ్రూట్స్ అలాగే గింజలు చాలా బాగా పనిచేస్తాయి. డ్రై ఫ్రూట్స్ , సీడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్లు కలిగి ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించే గుణాలతో ఉంటాయి. వాల్నట్స్, చియా సీడ్స్, అవిసె గింజల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. తృణధాన్యాలలో కూడా కీళ్ల నొప్పులను తగ్గించే పోషకాలు ఉంటాయి. పప్పులు, ధాన్యాలలో అధికంగా ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి కండరాలకు కావలసిన పోషకాలను అందిస్తాయి. వాటి పనితీరు మెరుగుగా ఉండేలా చేసి వాపులు, నొప్పులు రాకుండా చేస్తాయి. చేపలలోను కీళ్ల నొప్పులను తగ్గించే గుణాలు ఉన్నాయి. సాల్మన్ సార్డినెస్, మాకేరెల్, ట్యూనా చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండడం వల్ల ఇవి జాయింట్ పెయిన్స్ ను తగ్గిస్తాయి.
ఇంకా చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! అమరావతిపై ఢిల్లీ బిగ్ అప్డేట్ - గేమ్ ఛేంజర్! సీఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్దం! ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లోకేశ్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ! ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ కన్నీటితో..
కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?
ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం! పాఠశాలకు తాత్కాలికంగా మూడ్రోజులపాటు సెలవు!
అమెరికా జోరుగా సాగుతున్న తెలుగువారి హవా! ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు!
గుజరాత్ ను వణికిస్తున్న వైరస్! 8 మంది మృతి! హెచ్చరికలు జారీ!
ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం! మంత్రి ట్వీట్!
విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు!
10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! నోటిఫికేషన్ విడుదల! 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి!
ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు... నీ సంగతేంటో చూస్తా! ఇప్పుడేం పీకుతావో - టీడీపీ నేత వార్నింగ్!
మీ దగ్గర రూ.500 నోట్లు ఉన్నాయా! అయితే ఒక సారి చెక్ చేసుకోండి! ఆ గుర్తు ఉంటే అవి నకిలీ నోట్లే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: