అధిక మోతాదుతో రోగాలు కొని తెచ్చుకొంటున్నాం
తాజా ఆహారం, సుగంధ ద్రవ్యాలతో చెక్ పెట్టండి
న్యూఢిల్లీ, మే 16: ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం కావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నదని హెచ్చరించింది. రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చని తెలిపింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్దల్లో సగటు ఉప్పు వాడకం 10.78 గ్రాములుగా ఉందని.. ఇది తాము సూచించిన 5 గ్రాముల పరిమితి కంటే ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. ఎక్కువ ఉప్పు కలిగిన ఆహార పదార్థాలు తినడం వల్ల అన్నాశయ క్యాన్సర్, ఊబకాయం, ఆస్టియోపోరోసిస్, మెనియర్స్, మూత్ర పిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపింది. అధిక ఉప్పు వాడకం వల్ల ఏటా 18.9 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు ప్రతిగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించింది. తాజా, తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం తినడం ద్వారా ఉప్పు వాడకాన్ని తగ్గించొచ్చని డబ్ల్యూహెచ్ వో సూచించింది. ఉప్పు బదులుగా సుగంధ ద్రవ్యాలు, వన మూలికలను వాడమని సలహా ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
అమెరికా: బాధలో ఉన్న H1B వీసాదారులకు ఊరట! ఉద్యోగాలు కోల్పోయిన వారికోసం కొత్త గైడ్ లైన్స్!
సింగపూర్: అదృష్టం అంటే ఇలా ఉండాలి! ఎయిర్ లైన్ చరిత్రలో ఇది అత్యధిక బోనస్!
విజయనగరం: వైసీపీ నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్! అభ్యర్థుల ఆందోళన! నిలదీసిన టీడీపీ నేతలు
ఎన్నికల్లో హింస రీత్యా 12 మంది అధికారులపై ఈసీ వేటు!! వివరాలు ఇవే
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి