నిత్యం పలు పనుల్లో బిజీగా ఉండేవాళ్లు అనేక సందర్భాల్లో నిలబడి నీళ్లు తాగుతుంటారు. ఇలా చేయొచ్చని కొందరు అంటే మరి కొందరు మాత్రం నిలబడి నీరు తాగడం హానికరమని భావిస్తుంటారు. అయితే, ఆయుర్వేదం ఈ అంశంపై విస్పష్టమైన సూచనలు చేసింది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, నిలబడి నీళ్లు తాగడం అనేక రకాల అనారోగ్యాలకు దారి తీస్తుంది. నిలబడి నీళ్లు తాగడంతో నీరు వేగంగా కడుపులోకి చేరుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇది కడుపులో జీర్ణరసాల సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా, అరుగుదల తగ్గుతుంది. కాబట్టి, నీటి ప్రయోజనాలు పూర్తిగా పొందాలంటే నిలబడి నీరు తాగకపోవడమే శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.
నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్లల్లో నీరు పేరుకుంటుందట. అంతేకాకుండా, ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌ను దెబ్బతిని విషతుల్యాల విడుదలకు కారణమవుతుంది. అంతిమంగా ఇది కీళ్లనొప్పుల బారిన పడేలా చేస్తుంది. అయితే, ఆధునిక వైద్య శాస్త్ర నిపుణులు మాత్రం ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిలబడి నీళ్లు తాగినా, కూర్చుని నీళ్లు తాగినా పెద్ద తేడా ఏమీ ఉండదని చెబుతున్నారు. అయితే, పడుకుని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ నీరు తాగొద్దని హెచ్చరిస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: