హీరోయిన్ సంయుక్త మీనన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నటించి తక్కువ సినిమాలే అయినప్పటికీ ..ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. 'భీమ్లా నాయక్' ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ ఆ తరువాత విరూపాక్ష సినిమాతో స్టార్ హీరోయిన్‌గా నటించింది. బింబిసారా,సార్,డెవిల్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. తెలుగుతో పాటు, తమిళ , మళయాళ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగులో నిఖిల్ 'స్వయంభూ' తో పాటు.. శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కూడా మూవీస్ ఓకే చేసినట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంయుక్త మీనన్ .. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. హాట్ హాట్ ఫొటోషూట్‌లతో అభిమానులను అలరిస్తోంది.
ఇంకా చదవండి: భగవంతుడు అలా డిసైడ్ చేశాడు! తెలుగు పాటల పట్ల గాయని చిత్ర సంతృప్తి!
తాజాగా ఈ భామ ఓ ఇంటర్య్వూలో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో సంయుక్త మీనన్ తెలుగు ఇండస్ట్రీకి గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ.మలయాళంతో పోలిస్తే తెలుగు సినిమాల్లో నటించాలంటే చాలా కష్టం.భాష రాకపోవడం ఒక కారణం అయితే, మేకప్ మరో కారణమని తెలిపింది. వినడానికి వింతగా ఉన్నా కూడా నా వరకు అది చాలా పెద్ద విషయమని చెప్పుకొచ్చింది.మలయాళ సినిమాల్లో చేసేటప్పుడు మేకప్ వేసుకోవడం వెంటనే అయిపోతుంది.చాలా లైట్‌గా, సహజంగా వేస్తారు.యాక్టింగ్ చేసేటప్పుడు కూడా పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక తెలుగులో చాలా జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. తెరపై ఎలా కనిపిస్తామా అని ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలీ. ఎక్కువ మేకప్ వేస్తారు.షాట్ చేస్తున్నప్పుడు కూడా మేకప్‌ను చెక్ చేసుకోవాలి.అది నటించడానికి అంత కంఫర్ట్‌గా అనిపించదు. చర్మంపై ఏదో ఉన్నట్లే అనిపిస్తుంది నాకు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సంయుక్త చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: