నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి (Back Pain) సమస్య చాలా మందిని వేధిస్తోంది. ఎక్కువసేపు కూర్చోవడం, తప్పు పోస్టర్‌లో పనిచేయడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తీవ్రంగా మారుతోంది. ఒకసారి నడుము నొప్పి మొదలైతే చిన్న పనులు చేయడానికే ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు లేవడం, కూర్చోవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా, కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఉపశమనం పొందవచ్చు.
నడుము నొప్పి తగ్గించుకోవడానికి యోగా, వాకింగ్, స్విమ్మింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాయామాలు వెన్నెముక కండరాలను బలపరచడమే కాకుండా, శరీర రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ప్రత్యేకంగా యోగాలోని కొన్నిసాధారణ ఆసనాలు నడుం భాగానికి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడతాయి. అయితే వ్యాయామం ప్రారంభించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.
వాపు లేదా తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు చల్లటి ఐస్ కాంప్రెస్ లేదా వేడినీటి బ్యాగ్ ఉపయోగించడం మంచిది. ఐస్ కాంప్రెస్ వాపును తగ్గిస్తే, హాట్ వాటర్ బ్యాగ్ కండరాల గట్టి పట్టు (muscle stiffness)ను సడలిస్తుంది. ఈ రెండు విధానాలు తాత్కాలిక ఉపశమనం అందిస్తాయి. అయితే నొప్పి తరచుగా వస్తుంటే, దాని మూలకారణం తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
సరైన పోస్టర్‌లో కూర్చోవడం మరియు నిద్రపోవడం కూడా ఎంతో ముఖ్యం. ఎక్కువసేపు వంగి కూర్చోవడం లేదా సపోర్ట్ లేకుండా కూర్చోవడం వల్ల నడుం భాగంపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే సాఫ్ట్ లేదా అతి హార్డ్ బెడ్‌లపై నిద్రపోవడం కంటే మధ్యస్థంగా గట్టి ఉన్న మేట్రెస్‌పై నిద్రించడం మంచిది. రోజువారీ పనులలో సరైన భంగిమ పాటించడం ద్వారా నడుము నొప్పిని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
అదనంగా, శరీరానికి అవసరమైన కాల్షియం, విటమిన్ D వంటి పోషకాలు సరైన మోతాదులో తీసుకోవడం కూడా అవసరం. ఈ పోషకాలు ఎముకల బలాన్ని పెంచుతాయి, తద్వారా వెన్నెముకకు సహాయపడతాయి. ఫిజియోథెరపీ వంటి చికిత్సలు కూడా నడుము నొప్పిని తగ్గించడంలో ఉపయుక్తంగా ఉంటాయి. మొత్తం మీద, తగిన వ్యాయామం, సరైన భంగిమ, సమతుల్య ఆహారం, మరియు వైద్య సలహాతో నడుము నొప్పి నుంచి బయటపడవచ్చు.