Iran War: ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలం.. ఇక మిగిలింది కూడా ముగించేస్తామన్న ట్రంప్! అస్థిర వ్యక్తుల చేతికి.. Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Health Tips: వీరు ఈ పండు అస్సలు తినకూడదు... తింటే బాడీ లో ఆ పార్ట్ పనిచేయదట! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.! Iran War: ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలం.. ఇక మిగిలింది కూడా ముగించేస్తామన్న ట్రంప్! అస్థిర వ్యక్తుల చేతికి.. Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Health Tips: వీరు ఈ పండు అస్సలు తినకూడదు... తింటే బాడీ లో ఆ పార్ట్ పనిచేయదట! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.!

Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల

Nimmala Ramanayudu: వైసీపీ అధినేత జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో సాగుతున్నాయని, ఆయన 'గొడ్డలి రాజకీయం' రాష్ట్రానికి పెను ప్రమాదంగా పరిణమించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Published : 2026-04-12 20:50:00
  • Politics: జగన్ 'గొడ్డలి రాజకీయం' రాష్ట్రానికి ప్రమాదకరం: వైసీపీపై విరుచుకుపడ్డ మంత్రి నిమ్మల..
     
  • "అతన్ని బెంగళూరులోనే ఉంచండి": విజయమ్మ నాడే రోశయ్యకు ఫోన్ చేశారన్న మంత్రి నిమ్మల..

Nimmala Ramanayudu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ శైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ రాజకీయం ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో సాగుతోందని, ఆయన అనుసరిస్తున్న 'గొడ్డలి రాజకీయం' రాష్ట్ర భవిష్యత్తుకు పెను ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం అధికారం కోసం నరుకుతాం, చంపేస్తాం అనే హింసాత్మక భాషను వాడుతూ, విధ్వంసాన్నే తమ ప్రధాన ఎజెండాగా వైసీపీ మార్చుకుందని ఆయన మండిపడ్డారు. జగన్ తన అంతర్గత ఉద్దేశాలను ఇప్పుడు బహిరంగంగానే ప్రకటిస్తున్నారని, 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా ఆయనలో మార్పు రాలేదని నిమ్మల ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలోని యువత పట్ల వైసీపీ వైఖరిని ప్రశ్నిస్తూ, వారి 'యూత్ పాలసీ' అంటే మాదక ద్రవ్యాలను ప్రోత్సహించడం మరియు మద్యం వ్యాపారాల ద్వారా యువత భవిష్యత్తును నాశనం చేయడమేనా అని మంత్రి నిలదీశారు. రాజకీయ పార్టీలు ప్రజలకు మేలు చేస్తామని చెప్పాలి కానీ, వైసీపీ మాత్రం తాము అధికారంలోకి వస్తే పనులు ఆపేస్తామని, ఉన్నవి పడగొడతామని బెదిరించడం వారి వికృత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. హంతక ముఠాలకు మద్దతు ఇస్తూ, జంతువుల రక్తాన్ని ఫ్లెక్సీలపై చల్లి రాక్షసానందం పొందే వారు ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అలాగే, వాస్తవాలు రాసే మీడియా గొంతు నొక్కాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.

వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ మంత్రి నిమ్మల జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. సొంత బాబాయ్‌ని గొడ్డలితో వేటు వేసిన చరిత్ర జగన్‌దని, హత్యను గుండెపోటుగా చిత్రీకరించి సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పరిటాల రవి కేసు మాదిరిగానే వివేకా కేసులోనూ సాక్షులను మాయం చేస్తున్నారని, దీనికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, తన తల్లి మరియు చెల్లిని ఇంటి నుండి బయటకు గెంటేసిన జగన్, రాష్ట్రంలోని మహిళలకు మేలు చేస్తానంటే ఎవరూ నమ్మరని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో ఆచూకీ కూడా తెలియకముందే సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి కావాలని చూడటం జగన్ స్వార్థానికి పరాకాష్ట అని నిమ్మల విమర్శించారు.

వంగవీటి రంగా గారి గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. రంగా హంతకులను అక్కున చేర్చుకుని, వారి కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించిన ఘనత జగన్‌దని ఆయన ఆరోపించారు. రంగాను అవమానించిన వారికి పదవులు ఇచ్చి గౌరవించిన జగన్, ఇప్పుడు ఆయన పేరు ఎత్తడం హాస్యాస్పదమని అన్నారు. రాష్ట్ర విభజన కన్నా వైసీపీ ఐదేళ్ల పాలనతోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని, ఆ విధ్వంసం నుండి సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఉగ్రవాది నుంచి రాజకీయ ఉగ్రవాదిగా మారిన జగన్ పార్టీకి ప్రజలు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.

Spotlight

Read More →