PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Bikes Regestrations: 2028 నుంచి ఆ బైక్‌ల రిజిస్ట్రేషన్ బంద్... ఎందుకంటే! Digital Personal Loan: డిజిటల్ పర్సనల్ లోన్... చిటికెలో నగదు! సులభమైన పద్ధతులు ఇవే! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! China-USA: మా అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు.... అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Bikes Regestrations: 2028 నుంచి ఆ బైక్‌ల రిజిస్ట్రేషన్ బంద్... ఎందుకంటే! Digital Personal Loan: డిజిటల్ పర్సనల్ లోన్... చిటికెలో నగదు! సులభమైన పద్ధతులు ఇవే! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! China-USA: మా అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు.... అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్!

TANTEX: ఉత్తర టెక్సాస్‌లో ఘనంగా ఉగాది వేడుకలు! తెలుగు సంస్కృతికి అద్దం పట్టిన టాంటెక్స్!

Telugu Association of North Texas (TANTEX): ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 ఉగాది వేడుకలు తెలుగు సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ ఘనంగా జరిగాయి.

Published : 2026-04-14 11:11:00

ఆధ్యాత్మికతతో ప్రారంభమైన వేడుకలు..

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..

టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 ఉగాది వేడుకలు తెలుగు సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ ఘనంగా జరిగాయి. ఏప్రిల్ 5, 2026 ఆదివారం రాధాకృష్ణ టెంపుల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తెలుగు కుటుంబాలు హాజరై పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

మధ్యాహ్నం 1:30 గంటలకు సంప్రదాయ పూజలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఉగాది పచ్చడి, పానకం పంపిణీ చేయడం ద్వారా పండుగ ఆనందాన్ని అందరికీ పంచారు. అనంతరం 2026 సాంస్కృతిక చైర్ అనిత వేమిరెడ్డి స్వాగత ప్రసంగంతో సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

పంచాంగ శ్రవణం కార్యక్రమం ద్వారా కొత్త సంవత్సర ఫలితాలను వినిపించగా, తెలుగు పద్య పోటీలు భాషా సౌందర్యాన్ని ప్రతిబింబించాయి. ఈ ఏడాది ఉత్సవాల్లో “రీవైవల్” లైవ్ బ్యాండ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ గాయకులు అనిరుధ్ సుస్వరం, మనోజ్ఞ బెల్లంకొండ తమ గానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కార్యక్రమాన్ని మధురిమ వోడ్నాల, రాధా పేటరు ఉత్సాహంగా నిర్వహిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

టాంటెక్స్ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి తన ప్రసంగంలో సంస్థ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు. కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు కూడా ప్రత్యేక గుర్తింపునిచ్చారు.

ఈవెంట్ కోఆర్డినేటర్ అర్పితా రెడ్డి కృతజ్ఞతాభివందనాలతో కార్యక్రమం ముగిసింది. చివరగా అందరూ కలిసి భారత జాతీయ గీతాన్ని ఆలపించడం వేడుకకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో టాంటెక్స్ సభ్యులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి ఈ ఉగాది వేడుకలను ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయంగా మలిచారు.

Spotlight

Read More →