Aircraft Production: ఆకాశంలో రారాజులు... విమానాల తయారీలో ప్రపంచంలోనే టాప్ 5 దేశాలు ఇవే! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Unlimited 5G: అగ్రరాజ్యాలకు షాక్ ఇచ్చిన భారత్..! ప్రపంచంలోనే 5G క్యాపిటల్‌గా అవతరణ! Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Majjiga Atlu: అమ్మమ్మల నాటి కమ్మని 'మజ్జిగట్లు'.. స్పాంజ్ లాంటి అట్లు ఈజీ ప్రాసెస్! Customs Duty 2026: ప్రయాణికులకు గుడ్ న్యూస్... విదేశాల నుండి బంగారం తెస్తున్నారా? 2026 కొత్త రూల్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు! Aircraft Production: ఆకాశంలో రారాజులు... విమానాల తయారీలో ప్రపంచంలోనే టాప్ 5 దేశాలు ఇవే! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Unlimited 5G: అగ్రరాజ్యాలకు షాక్ ఇచ్చిన భారత్..! ప్రపంచంలోనే 5G క్యాపిటల్‌గా అవతరణ! Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Majjiga Atlu: అమ్మమ్మల నాటి కమ్మని 'మజ్జిగట్లు'.. స్పాంజ్ లాంటి అట్లు ఈజీ ప్రాసెస్! Customs Duty 2026: ప్రయాణికులకు గుడ్ న్యూస్... విదేశాల నుండి బంగారం తెస్తున్నారా? 2026 కొత్త రూల్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు!

AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్!

AI Hub in vizag: విశాఖపట్నంలో గూగుల్ సుమారు లక్షా పాతిక వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనికి తోడు 'ఇండియా-అమెరికా కనెక్ట్' ద్వారా సముద్రగర్భంలో నేరుగా అమెరికా-భారత్ మధ్య కేబుల్స్ వేసి ఇంటర్నెట్ వేగాన్ని పెంచబోతున్నారు.

Published : 2026-02-19 11:20:00

వైజాగ్‌కు గూగుల్ మెగా గిఫ్ట్…

 $15 బిలియన్ల పెట్టుబడితో భారీ AI హబ్!

డిజిటల్ విప్లవానికి వైజాగ్ వేదిక..

సుందర్ పిచాయ్ ప్రకటించిన ఈ మూడవ అంశం సాంకేతిక పరంగా అత్యంత కీలకమైనది. "ఈ ఎదుగుదల వెనుక మనకున్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలే ప్రధాన కారణం. గత ఏడాదే మేము వైజాగ్‌లో (విశాఖపట్నం) సుమారు $15 బిలియన్ల (సుమారు రూ.1.25 కోట్లు) పెట్టుబడితో ఒక పెద్ద AI హబ్‌ను ప్రకటించాము.

​ఈ సెంటర్‌లో అత్యంత వేగవంతమైన కంప్యూటింగ్ శక్తి మరియు సముద్రం అడుగున వేసే అంతర్జాతీయ కేబుల్ కనెక్షన్లు ఉంటాయి. ఇది పూర్తయితే, భారతదేశం అంతటా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా, సామాన్యులకు మరియు వ్యాపారాలకు సరికొత్త టెక్నాలజీ (AI) ప్రయోజనాలు అందుతాయి.

​దీనికి కొనసాగింపుగా, ఈరోజు మేము 'ఇండియా-అమెరికా కనెక్ట్' అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాము. దీని ద్వారా సముద్రం అడుగున కొత్త కేబుల్ మార్గాలను ఏర్పాటు చేసి.. అమెరికా, భారత్ మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మధ్య ఇంటర్నెట్ మరియు AI కనెక్షన్‌ను మరింత వేగవంతం చేస్తాము." అని నిన్న ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సులో ప్రకటించారు.

అసలు కొత్తగా ఈ  'ఇండియా-అమెరికా కనెక్ట్' అంటే ఏమిటి అంటే..  ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ మరియు డేటా ఒక దేశం నుండి మరో దేశానికి చేరడానికి సముద్రం అడుగున వేల కిలోమీటర్ల పొడవైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఉంటాయి. గూగుల్ ఇప్పుడు నేరుగా అమెరికాను మరియు భారతదేశాన్ని కలిపేలా కొత్త కేబుల్ మార్గాలను నిర్మిస్తోంది.

AI అప్లికేషన్లు (ఉదాహరణకు: చాట్ బాట్స్, డేటా అనలిటిక్స్) వేగంగా పనిచేయాలంటే భారీ స్థాయిలో డేటా ట్రాన్స్‌ఫర్ జరగాలి. ఈ కొత్త కేబుల్స్ ద్వారా డేటా ప్రయాణించే వేగం మరియు సామర్థ్యం పెరుగుతాయి.

ప్రస్తుతం భారతదేశం ఎక్కువగా సింగపూర్ లేదా యూరప్ మీదుగా వచ్చే కేబుల్స్ పై ఆధారపడుతోంది. ఈ కొత్త 'ఇండియా-అమెరికా కనెక్ట్' వల్ల మధ్యలో అంతరాయాలు లేకుండా నేరుగా కనెక్షన్ ఉంటుంది. దీనివల్ల ఇంటర్నెట్ వేగం పెరగడమే కాకుండా, ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది..ఇది కేవలం భారత్‌కే పరిమితం కాకుండా, దక్షిణ గోళార్థంలోని మరిన్ని దేశాలను కలుపుతూ సాగుతుంది. తద్వారా వైజాగ్ ఒక అంతర్జాతీయ 'డిజిటల్ గేట్‌వే'గా మారుతుంది.

Spotlight

Read More →