Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! TGSRTC Special Offer: రూ. 5130 కే గోవా టూర్.. టీజీఎస్ఆర్టీసీ సరికొత్త బంపర్ ఆఫర్! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Postal Services: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ 11 నగరాల్లో 24 గంటల పాటు పోస్టల్ సేవలు...! AP Govt Schemes: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై అసెంబ్లీలో కీలక చర్చ.!! Land Rights: భూ సమస్యలకు ఎండ్ కార్డ్..! 22ఏ జాబితాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! HPV Vaccine: మహిళల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం పెద్ద అడుగు... 14 ఏళ్ల లోపు అమ్మాయిలకు ఉచితంగా HPV! Loans: చిటికెలో లోన్.. సులభమైన వాయిదాలు... నేటి ట్రెండ్ ఇదే! Solar Battery: సోలార్ బ్యాటరీ బ్యాంక్ లైఫ్ పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! TGSRTC Special Offer: రూ. 5130 కే గోవా టూర్.. టీజీఎస్ఆర్టీసీ సరికొత్త బంపర్ ఆఫర్! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Postal Services: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ 11 నగరాల్లో 24 గంటల పాటు పోస్టల్ సేవలు...! AP Govt Schemes: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై అసెంబ్లీలో కీలక చర్చ.!! Land Rights: భూ సమస్యలకు ఎండ్ కార్డ్..! 22ఏ జాబితాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! HPV Vaccine: మహిళల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం పెద్ద అడుగు... 14 ఏళ్ల లోపు అమ్మాయిలకు ఉచితంగా HPV! Loans: చిటికెలో లోన్.. సులభమైన వాయిదాలు... నేటి ట్రెండ్ ఇదే! Solar Battery: సోలార్ బ్యాటరీ బ్యాంక్ లైఫ్ పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Cucumber Pachdi: నోరూరించే దోసకాయ రోటి పచ్చడి.. ఒక్కసారి ఈ స్టైల్ లో చేయండి అదిరిపోయే రుచి మీ సొంతం!

Cucumber Pachadi Tips: చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కలపాలి. ఇక్కడ ముఖ్యమైన చిట్కా ఏంటంటే.. దోసకాయ ముక్కలను అస్సలు ఉడికించకూడదు.

Published : 2026-02-25 09:21:00

దోసకాయ పచ్చడి ఇలా చేస్తే.. అందరూ ఫిదా అవ్వాల్సిందే!

హోటల్ స్టైల్ దోసకాయ రోటి పచ్చడి..

దోసకాయ పచ్చడిలో ఈ చిన్న చిట్కా పాటిస్తే.. పాతకాలపు రుచి మీ సొంతం!

Cucumber Pachadi Tips: దోసకాయ పచ్చడి అంటే ఇష్టపడని తెలుగు వారుండరు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, పక్కన ఈ పచ్చడి ఉంటే ఆ మజాయే వేరు. అయితే చాలామందికి హోటల్ స్టైల్ లేదా పాతకాలపు రోటి పచ్చడి రుచి ఇంట్లో రాదు. కానీ, కేవలం కొన్ని సింపుల్ ఇంగ్రిడియంట్స్‌తో ప్రతిసారీ అదే అద్భుతమైన రుచి వచ్చేలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ పద్ధతిలో చేస్తే మీరు ఎప్పుడు చేసినా ఇంట్లో అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఆ రుచి రహస్యం ఏంటో  తెలుసుకోవాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం. 
 
ముందుగా ఈ పచ్చడి తయారీ కోసం బాండీలో తగినంత నూనె వేడి చేయాలి. నూనె కాగాక అందులో కొద్దిగా జీలకర్ర వేసి చిటపటలాడించాలి. జీలకర్ర మంచి సువాసన వస్తున్నప్పుడు, అందులో మీడియం సైజులో కోసుకున్న టమాటా ముక్కలను వేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, టమాటాలను   తక్కువ మంట మీద మాత్రమే మగ్గించాలి. టమాటాల్లోని నీరంతా పోయి, ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకుంటేనే పచ్చడికి అసలైన టేస్ట్ వస్తుంది.

టమాటాలు మగ్గుతున్నప్పుడే మీ రుచికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవి బాగా వేగాక, పచ్చడికి మంచి రంగు  పులుపు రావడం కోసం కొద్దిగా చింతపండును కూడా జోడించాలి. చింతపండును కూడా నూనెలో కాసేపు మగ్గనిస్తే పచ్చడి ఎక్కువ సేపు నిల్వ ఉంటుంది. ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత,  రోట్లో వేసి తగినంత ఉప్పు కలిపి కచ్చాపచ్చాగా నూరుకోవాలి.

ఇక ఈ పచ్చడికి అసలైన ప్రాణం దోసకాయ ముక్కలు మనం ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా మిశ్రమంలో, చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కలపాలి. ఇక్కడ ముఖ్యమైన చిట్కా ఏంటంటే.. దోసకాయ ముక్కలను అస్సలు ఉడికించకూడదు. పచ్చి ముక్కలనే పచ్చడిలో కలపడం వల్ల మనం అన్నం తినేటప్పుడు అవి పంటికి తగులుతూ భలే రుచిగా ఉంటాయి. దోసకాయ గింజలు చేదుగా లేకుండా చూసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

ఈ పచ్చడికి పోపు పెడితే ఆ రుచి రెట్టింపు అవుతుంది. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టుకుని పచ్చడిలో కలుపుకుంటే ఘుమఘుమలాడే దోసకాయ రోటి పచ్చడి రెడీ దోసకాయ ముక్కలను పచ్చడిలో వేసి మరీ మెత్తగా చేయకుండా, ముక్కలు ముక్కలుగా ఉండేలా చూసుకుంటేనే ప్రతి ముద్దలోనూ ఆ కమ్మదనం తెలుస్తుంది.

Spotlight

Read More →