Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Full rains: గంట వాన.. 50 చెట్లు నేలమట్టం! బెంగళూరులో వాన బీభత్సం.. ఏడుగురి మృతి.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Maruti Suzuki: లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజ్... మారుతీ నుంచి అత్యంత చౌకైన ‘హైబ్రిడ్’ కారు.. కొత్త బాలెనో హైబ్రిడ్ ఫీచర్లు ఇవే! Indian Techie: ఎన్నారైలను వెంటాడుతున్న 'సైలెంట్ కిల్లర్'... అమెరికాలో తెలుగు టెక్కీ కన్నుమూత! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Full rains: గంట వాన.. 50 చెట్లు నేలమట్టం! బెంగళూరులో వాన బీభత్సం.. ఏడుగురి మృతి.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Maruti Suzuki: లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజ్... మారుతీ నుంచి అత్యంత చౌకైన ‘హైబ్రిడ్’ కారు.. కొత్త బాలెనో హైబ్రిడ్ ఫీచర్లు ఇవే! Indian Techie: ఎన్నారైలను వెంటాడుతున్న 'సైలెంట్ కిల్లర్'... అమెరికాలో తెలుగు టెక్కీ కన్నుమూత!

Heatwave: 16 జిల్లాల్లో ఎండ తీవ్రత.. కొన్ని చోట్ల పిడుగులతో వర్షాలు!

Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మార్మోగుతోంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన అకాల వర్షాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Published : 2026-04-29 19:54:00

పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం..

నెల్లూరు జిల్లాలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత..

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మార్మోగుతోంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన అకాల వర్షాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, రేపు మరియు ఎల్లుండి కూడా ఇదే తరహా పరిస్థితులు కొనసాగనున్నాయని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బుధవారం నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 28 జిల్లాల్లో 16 జిల్లాల పరిధిలోని 88 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.

ఇవాళ నమోదైన ముఖ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి: కొమ్మిపాడు (నెల్లూరు) – 44.1°C, దేవరపల్లి (అనకాపల్లి) – 43.4°C, బెల్లంకొండ (పల్నాడు) – 43.3°C, నందనమారెళ్ళ (మార్కాపురం) – 43.2°C, గంగవరం (చిత్తూరు) – 42.8°C, నగరడోన (కర్నూలు) – 42.7°C, దొరవారిసత్రం (తిరుపతి) – 42.5°C, తొర్రగుడిపాడు (ఎన్టీఆర్) – 42.4°C, మక్కువ (మన్యం), వీఆర్ పురం (పోలవరం) – 42.2°C, చాగలమర్రి (నంద్యాల), కొప్పెరపాడు (ప్రకాశం), లింగాల (వైఎస్సార్ కడప) – 42.1°C, రాయదుర్గం (అనంతపురం) – 42°Cగా నమోదయ్యాయి.

గురువారం (30-04-2026) మరింత జాగ్రత్త అవసరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి, బొండపల్లి, రామభద్రాపురం మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం మండలాలు, అలాగే అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అదనంగా మరో 20 మండలాల్లో సాధారణ వడగాల్పులు ఉండే సూచనలు ఉన్నాయి.

ఇక మరోవైపు ద్రోణి ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో రైతులు, పశుకాపరులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉరుములు, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎండలతో పాటు అకాల వర్షాల మిశ్రమ వాతావరణం కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. అధికారులు సూచనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

Spotlight

Read More →