Iran War: ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలం.. ఇక మిగిలింది కూడా ముగించేస్తామన్న ట్రంప్! అస్థిర వ్యక్తుల చేతికి.. Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Health Tips: వీరు ఈ పండు అస్సలు తినకూడదు... తింటే బాడీ లో ఆ పార్ట్ పనిచేయదట! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.! Iran War: ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలం.. ఇక మిగిలింది కూడా ముగించేస్తామన్న ట్రంప్! అస్థిర వ్యక్తుల చేతికి.. Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Health Tips: వీరు ఈ పండు అస్సలు తినకూడదు... తింటే బాడీ లో ఆ పార్ట్ పనిచేయదట! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.!

Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.!

Amarnath Yatra: పవిత్ర అమర్‌నాథ్ యాత్ర 2026 షెడ్యూల్‌ను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఈ ఏడాది యాత్ర జులై 3న ప్రారంభమై, 57 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినం రోజున ముగుస్తుందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా వివరాలను పంచుకుంది.

Published : 2026-04-12 17:00:00
  • "శివయ్య దర్శనానికి సర్వం సిద్ధం": ఆగస్టు 28న రక్షాబంధన్ రోజున ముగియనున్న అమర్‌నాథ్ యాత్ర..
     
  • 57 రోజుల పాటు బాబా బర్ఫానీ దర్శనం: దేశవ్యాప్తంగా భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేసిన జమ్మూకశ్మీర్ ప్రభుత్వం..

Amarnath Yatra: పవిత్ర అమర్‌నాథ్ యాత్ర 2026 షెడ్యూల్‌ను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఈ ఏడాది యాత్ర జులై 3న ప్రారంభమై, 57 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినం రోజున ముగుస్తుందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా వివరాలను పంచుకుంది.

షెడ్యూల్ ప్రకారం యాత్ర ప్రారంభానికి ముందు జూన్ 29న జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా శివుని ఆశీస్సులు కోరుతూ 'ప్రథమ పూజ' నిర్వహిస్తారు. యాత్ర కోసం ఈ నెల‌ 15 నుంచి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న జమ్మూకశ్మీర్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్‍బీఐ, యస్ బ్యాంక్‌లకు చెందిన 554 బ్రాంచుల ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయ గుహలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని శివుని స్వరూపంగా భక్తులు విశ్వసిస్తారు.

భక్తులు రెండు మార్గాల ద్వారా ఈ యాత్రను పూర్తి చేసుకోవ‌చ్చు. ఒకటి సాంప్రదాయ పహల్గామ్ మార్గం కాగా, మరొకటి బల్తాల్ మార్గం. పహల్గామ్ మార్గంలో 34 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది, దీనికి 3-5 రోజులు పడుతుంది. బల్తాల్ మార్గం 14 కిలోమీటర్లు మాత్రమే ఉండి, యాత్ర పూర్తి చేసి అదే రోజు బేస్ క్యాంప్‌కు తిరిగి రావచ్చు. ఈ రెండు మార్గాల నుంచి హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

ట్రావ్-లాంజ్ (TravLounge) - మీ స్నేహపూర్వక ట్రావెల్ ఏజెంట్
మీ ప్రయాణాలను సులభతరం చేయడంలో 'ట్రావ్-లాంజ్' ఎల్లప్పుడూ ముందుంటుంది. అమర్‌నాథ్ యాత్ర వంటి ఆధ్యాత్మిక ప్రయాణాల నుండి అంతర్జాతీయ పర్యటనల వరకు, ప్రతి దశలోనూ మీకు అండగా నిలిచే నమ్మకమైన ట్రావెల్ పార్టనర్ ట్రావ్-లాంజ్. సరసమైన ధరల్లో ఉత్తమమైన ట్రావెల్ ప్యాకేజీలు, హోటల్ బుకింగ్స్ మరియు వీసా సేవలను అందిస్తూ, మీ పర్యటనను మధుర జ్ఞాపకంగా మార్చడమే వారి లక్ష్యం. సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఈరోజే మమ్మల్ని సంప్రదించండి.

Spotlight

Read More →