ఆ వజ్రపు ఉంగరం.. సిగ్గుతో హింట్! విజయ్ దేవరకొండతో నిశ్చితార్థంపై రష్మిక క్లారిటీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నానుడికి కొత్త అర్థం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. పట్టణాల్లో నివసించే మధ్యతరగతి మహిళల ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని తాజాగా వెలువడిన సర్వేలు సూచించాయి. ఈ నేపథ్యంలో మహిళల ఆరోగ్య రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రభుత్వం ‘సఖి సురక్ష హెల్త్‌కేర్ స్క్రీనింగ్’ పేరుతో ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తమ ఆరోగ్య స్థితిని సులభంగా తెలుసుకోవడంతో పాటు, అవసరమైన చికిత్సలు సమయానికి పొందే అవకాశం ఉంటుంది.

Costly Sweet: దేశంలో లోనే అత్యంత ఖరీదు అయిన స్వీట్..! ధర ఎంతో తెలుసా..!

మొదటి దశలో ఈ ప్రాజెక్ట్‌ను శ్రీకాకుళం జిల్లాలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 19 వరకు వివిధ పట్టణాల్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో 35 ఏళ్లు దాటిన మహిళలకు 16 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, థైరాయిడ్‌, రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకునే అవకాశం కల్పించబడుతుంది.

బిగ్‌బాస్ 9లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ 5 రేసు నుంచి ఔట్! ఊహించని ఎలిమినేషన్‌తో ఫ్యాన్స్‌కు..

ఇటీవలి కాలంలో పట్టణ ప్రాంతాల్లో జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆహార అలవాట్ల కారణంగా మహిళల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే స్వయం సహాయక సంఘాల మహిళలు ఆరోగ్యపరంగా బలంగా, చురుకుగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రీకాకుళం, ఆమదాలవలస, పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో సుమారు 2,000 మంది మహిళలు ఈ సేవల ద్వారా లబ్ధిపొందనున్నారని అధికారులు తెలిపారు. స్థానిక వైద్య బృందాలు, మున్సిపల్ అధికారులు కలిసి ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Bhagavad Gita : ప్రేమలో ద్వేషానికి చోటు లేదు.. మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -37!

పరీక్షల షెడ్యూల్ కూడా ఇప్పటికే ప్రకటించబడింది. శ్రీకాకుళంలో అక్టోబర్ 28, 29, నవంబర్ 1, 2 తేదీల్లో, ఆమదాలవలసలో నవంబర్ 3, 4న, పలాస–కాశీబుగ్గలో నవంబర్ 14, 15, 17న, ఇచ్ఛాపురంలో నవంబర్ 18, 19 తేదీల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మహిళల ఆరోగ్య సంరక్షణలో ‘సఖి సురక్ష’ కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

K-Ramp: కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో మంచి ఓపెనింగ్.. K-Ramp మొదటి రోజు కలెక్షన్లు ఎంత అంటే!
Highcourt: గురుకుల పార్ట్‌టైమ్ టీచర్లకు హైకోర్టు ఊరట..! కీలక ఆదేశాలు జారీ..!
కొత్త భయం.. తండ్రికి కరోనా సోకితే.. పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం.! ప్రజారోగ్యానికి పెను సవాల్!
ISRO విజయం సూర్యుడి నుండి వచ్చే ఉద్గారాల (CME) రహస్యాన్ని ఛేదించిన చంద్రయాన్-2!
Nitish: తెలుగు యువ ఆటగాడికి క్రికెట్ కెరీర్‌లో మరో గోల్డెన్ మూమెంట్.. ఇక ఆల్ ఫార్మాట్ ప్లేయర్!
Australia Visit: మంత్రి నారా లోకేశ్‌కు సిడ్నీ విమానాశ్రయంలో ఘన స్వాగతం..! అధునాతన బోధనా పద్ధతులను..!