ఆస్ట్రేలియాలో ఆంధ్ర యువతకు కొత్త అవకాశాలు.. కీలక అంశాలు చర్చించేందుకు లోకేష్ పయనం !!

జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఇటీవల జోర్డాన్‌లోని ఒక కంపెనీలో పనిచేస్తున్న 12 మంది తెలంగాణ కార్మికులు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వీడియో ద్వారా వెల్లడించారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి దృష్టి సారించగా, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిఏడి ఎన్నారై విభాగం తక్షణ చర్యలు ప్రారంభించింది. వారు భారత రాయబార కార్యాలయంతో పాటు ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించి, కార్మికుల కేసును ‘మదద్’ పోర్టల్‌లో నమోదు చేశారు.

సుధీర్ బాబు జటాధర ట్రైలర్ రిలీజ్.. మిస్టరీ, మైథలజీ మిక్స్‌కి ఫ్యాన్స్ ఫిదా!

జిఏడి ఎన్నారై విభాగానికి చెందిన ఐఏఎస్ అధికారులు సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి మరియు సి.హెచ్. శివలింగయ్య ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలంగాణ ప్రజల భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. జోర్డాన్ ఘటనను మానవీయ కోణంలో చూడాలని, రాజకీయ కోణంలో లాగరాదని ఆయన బీఆర్ఎస్ నేతలకు సూచించారు.

Satellites: ISRO నుండి.... నేడు నింగిలోకి మూడు శాటిలైట్లు!

ఇక జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు 'మిల్లీనియం అగ్రికల్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్' అనే కంపెనీని ప్రత్యక్షంగా సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న మొత్తం 170 మంది భారతీయ కార్మికులలో చాలా మంది సంతృప్తిగా ఉన్నారని, అయితే తెలంగాణకు చెందిన 12 మంది మాత్రం పని చేయడానికి నిరాకరించి, భారత్‌కు తిరిగి పంపాలని కోరుతున్నారని ఎంబసీ నివేదికలో పేర్కొన్నారు.

Railway Jobs: రాతపరీక్ష లేకుండా రైల్వే అప్రెంటిస్ పోస్టులు..! వెంటనే అప్లై చేయండి..!

ఎంబసీ అధికారులు సమీక్షించిన ప్రకారం, కంపెనీ తమ సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పిస్తోందని తేలింది. ఆహార సమస్యల పరిష్కారానికి ప్రత్యేక భారతీయ వంటకారుడిని నియమించారని, జీతాలు ఫింగర్‌ప్రింట్ ధృవీకరణ ద్వారా చెల్లిస్తున్నారని చెప్పారు. అలాగే నివాసం, వైద్యం వంటి సౌకర్యాలు ఒప్పంద ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

ప్రపంచంలోనే పొడవైన రైల్వే స్టేషన్ — గిన్నిస్‌ రికార్డులో స్థానం… అది ఎక్కడంటే?

ప్రస్తుతం పనికి హాజరుకాని ఆ 12 మంది కార్మికులు రూముల్లోనే ఉన్నారని, ఇది ఒప్పంద ఉల్లంఘనగా పరిగణించబడవచ్చని ఎంబసీ హెచ్చరించింది. వారు పని చేయకుంటే జీతాలు చెల్లించలేమని కంపెనీ స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF) కింద వారు ప్రయోజనాలు పొందడం కష్టమని అధికారులు తెలిపారు.

ఏపీలో రైలు ప్రయాణికులకు ఎగిరి గంతేసే వార్త.. ఆ రెండు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్ల అక్కడా ఆగుతాయి..
రుషికొండ భవనాలకు దిశానిర్దేశం.. 4 రకాలుగా వాడుకోవచ్చు! ఛాన్స్ ఇమ్మన్న స్టార్ హోటల్స్..!
ఓటీటీలోకి రూ.300 కోట్ల సంచలనం.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రామ్మోహన్ నాయుడు.. స్వచ్ఛత, సైకిల్, టెక్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు!!
ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకునేదాన్ని - అనసూయ బోల్డ్ కామెంట్స్!