మొన్న నాన్న, నిన్న బాబాయి, నేడు చెల్లి, తల్లి! దొంగ సింపతీ నాటకాలు ఆపు!!

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈయన సింపతి రాజకీయాలకు పదును పెడుతున్నారు. 2019లో అధికారం కోసం సొంత బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఎన్నిక

Published : 2024-01-06 18:57:00

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈయన సింపతి రాజకీయాలకు పదును పెడుతున్నారు.

2019లో అధికారం కోసం సొంత బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఎన్నికలలో సానుభూతిగా వాడుకొని విజయం సాధించారు.

వివేకానంద రెడ్డి హత్యకు చంద్రబాబునాయుడు ప్రధాన పాత్ర పోషించాలని ఎన్నికల వేదికలపై ఈయన గళమెత్తారు.

ఈయన అధికారం చేపట్టిన వెంటనే కుటుంబంలో తనకు ఏనాడైనా ప్రత్యామ్నయం అవుతుందన్న భయంతో తల్లిని,చెల్లిని పార్టీకి ప్రభుత్వానికి దూరంగా పెట్టారు.

ఈయన జైల్లో ఉన్నప్పుడు అన్న వదిన బాణంగా 3000 కిలోమీటర్లు షర్మిల పాదయాత్ర చేసి ఈయన విజయానికి శ్రమించారు.

తల్లి విజయమ్మ కూడా తనదైన శైలిలో బహిరంగ సభలలో పాల్గొని తండ్రి లేని బిడ్డను ఆదరించాలంటూ ప్రజలను వేడుకున్నారు.

తల్లి చెల్లి రెక్కల కష్టంతో అధికారం చేపట్టిన ఈయన తల్లిని చెల్లిని పక్కన పెట్టడంతో కుటుంబంలో నాలుగేళ్ల క్రితమే చీలిక వచ్చింది.

గత్యంతరం లేని పరిస్థితులలో షర్మిల తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని పెట్టి రాజకీయంగా అరంగ్రేటం చేశారు.

తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో జరిగిన ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ పగ్గాలు తీసుకునేలా షర్మిల వైయస్సార్ టిపిని ఏందంటే కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు.

తల్లిని చెల్లిని నిర్ధాక్షణంగా బయటకు గెంటిన ఈయన నేడు కాకినాడ సభలో ప్రతిపక్షాలు తన కుటుంబంలో చిచ్చు పెడుతున్నాయంటూ సింపతి ప్రసంగాలు ప్రారంభించారు.

వివేకానంద రెడ్డి హత్యతో వివేకానంద రెడ్డి కుటుంబం ఈయనకి దూరంగా జరిగి సిబిఐ ఎంక్వైరీ వేయించుకుని పోరాటం చేస్తున్నారు.

వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న అవినాష్ రెడ్డిని జగన్ మోహన్ రెడ్డి కాపాడుతున్నప్పుడే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈయన పాత్ర ప్రజలు గ్రహించారు.

ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాయ్ హత్య కేసును చేదించవలసింది పోయి నేటికీ దోషులను కాపాడుతూ వివేకానంద రెడ్డి కుటుంబాన్ని దూరం చేసుకున్నారు.

ఈయన విజయం కోసం అహోరాత్రులు శ్రమించిన తల్లి చెల్లికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలో కానీ ప్రభుత్వంలో గాని సముచిత స్థానం కల్పిస్తే వారు కూడా ఈయన తో కలిసి ఉండేవారు.

ఈయన అధికార మదంతో తల్లిని చెల్లిని నాలుగేళ్ల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ నుంచి వెళ్లగొట్టి నేడు తన కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు అంటూ సానుభూతి ప్రసంగాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తులలో చెల్లికి వాటా ఇవ్వకుండా అధికారంలో భాగమేవకుండా నిర్ధాక్షణంగా బయటకు వెళ్ళగొట్టినట్లు చెల్లి షర్మిల మీడియా వేదికగా వాపోయిన సంగతి పాటకులకు తెలిసినదే.

ఈయన ప్రభుత్వంలో తల్లికి చెల్లికి స్థానం లేనప్పుడు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి పనిచేసే వారికి స్థానం ఎలా ఉంటుంది.

వైసీపీలో మాఫియా గ్యాంగ్ కు అగ్ర పీఠం వేస్తున్నారు అన్న ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూరేలా ఈయన నిర్ణయాలు ఉంటున్నాయి.

గంజాయి మాఫియా డాన్ గా పేరు పొందిన ఎమ్మెల్సీ అనంత బాబు దళిత యువకుడ్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఈయన హత్తుకుని తిరుగుతున్నారు.

బళ్ళారి ఐరన్ ఓర్ గనుల మాఫియా గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములు చెల్లెలు శాంత మధ్యాహ్నం వైకాపా కండువా కప్పుకుంటే సాయంత్రానికి హిందూపురం ఎంపీ టికెట్ కేటాయించారు.

ఈయన బంధువు కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించి తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నారు.

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమ సంపాదనకు కర్త కర్మ క్రియగా ఉన్న విజయ్ సాయి రెడ్డిని ఇప్పటికే రెండుసార్లు రాజ్యసభ సభ్యులుగా నియమించారు.

రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలలో నలుగురు సామంత రాజులను పెట్టుకుని రాష్ట్ర సహజ సంపదను ఈయన దోపిడీ చేస్తున్నారు.

ఈయన చర్యలు అన్నీ కూడా గ్రహించిన కుటుంబ సభ్యులు దూరంగా జరిగి నాటి నుండి నేటి వరకు వారి ప్రాణాలను కాపాడుకుంటూ వచ్చారు.

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈయన చేసిన దుశ్చర్యలకు ప్రతీకారం తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి పైకి యుద్ధానికి వస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సొంత ఆదాయం పెంచుకోవడానికి పనిచేసింది తప్ప రాష్ట్ర ప్రజల కొరకు పనిచేయలేదని వైయస్సార్సీపీలో ప్రధాన నాయకుడైన విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాధ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఈయన ప్రభుత్వం పాలనకు నిదర్శనం.

ప్రజా రంజిక పాలన చేపడితే ఈయన ఎన్నికల ముందు చెప్పినట్లుగా మరొక 30 సంవత్సరాలు రాష్ట్రములో అధికారంలో ఉండేవారు.

అధికారం చేపట్టిన నాటినుండి రాష్ట్ర అభివృద్ధిని విధ్వంసం చేసి వ్యవస్థలను భ్రష్టు పట్టించి దళితులపై దాడులు హత్యలు అత్యాచారాలతో రాష్ట్రంలో విధ్వంసకరపాలెం చేసి తన పార్టీని తానే పాతరేసుకుంటున్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →