భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ రోజురోజుకు పెరుగుతోంది అనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మోటరోలా మరోసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధమైంది. కంపెనీ కొత్త ఫోన్ మోటో G67 పవర్ 5G ను ఈరోజు (నవంబర్ 5) మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించనుంది.
ఫ్లిప్‌కార్ట్ మరియు మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ ద్వారా ఫోన్ ముఖ్యమైన ఫీచర్లు, డిజైన్ వివరాలు బయటకు వచ్చాయి.
భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్
మోటో G67 పవర్ 5G ప్రధాన ఆకర్షణ 7,000mAh బ్యాటరీ. దీని ద్వారా కంపెనీ సింగిల్ ఛార్జ్‌లో 58 గంటల వరకు బ్యాకప్ అందిస్తుందని చెబుతోంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్ వేగంగా ఛార్జ్ అవుతుంది.
పర్ఫార్మెన్స్ విషయానికొస్తే,ఇందులో Qualcomm Snapdragon 7s Gen 2 (4nm) చిప్‌సెట్ ఉంది. 8GB RAMతో పాటు 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. RAM Boost ఫీచర్‌తో వర్చువల్‌గా 24GB వరకు RAM పెంచుకోవచ్చు.
డిస్ప్లే & డిజైన్
ఫోన్‌లో 6.7 అంగుళాల Full HD+ LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్‌రేట్, HDR10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్న ఈ డిస్ప్లే, వినియోగదారులకు స్మూత్ స్క్రోలింగ్, క్లియర్ విజువల్ అనుభవాన్ని ఇస్తుంది.
Gorilla Glass 7i రక్షణతో పాటు MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ మరియు IP64 రేటింగ్ కూడా పొందింది. అంటే, ఈ ఫోన్ సాధారణ దుమ్ము, చినుకులు తట్టుకోగలదు.
మోటరోలా ఈసారి ఫోన్ బాడీని వెగన్ లెదర్ ఫినిష్ తో రూపొందించింది. మూడు పాంటోన్ కలర్ వేరియంట్లు — Parachute Purple, Blue Curacao, Cilantro Green అందుబాటులో ఉంటాయి.
కెమెరా సెటప్
ఫోన్‌లో AI ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్ ఆధారంగా పని చేసే ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది.
50MP Sony LYT-600 ప్రైమరీ సెన్సార్ (f/1.8)
8MP అల్ట్రా వైడ్ లెన్స్ (f/2.2)
2MP Flicker కెమెరా
ఫ్రంట్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అన్ని కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌కి సపోర్ట్ చేస్తాయి. రాత్రి ఫోటోల కోసం Night Vision Mode, రెండు కెమెరాలనూ ఒకేసారి ఉపయోగించేందుకు Dual Capture Mode, అలాగే *మGoogle Lens వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఆపరేటింగ్ సిస్టమ్ & ఇతర ఫీచర్లు
మోటో G67 పవర్ 5G Android 15 ఆధారంగా నడుస్తుంది. కంపెనీ Android 16 అప్‌డేట్ ను కూడా హామీ ఇస్తోంది. ఫోన్‌లో Smart Connect, Twist to Open Camera, Chop Twice for Flashlight వంటి క్లాసిక్ మోటరోలా ఫీచర్లు కొనసాగించబడ్డాయి.
భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్‌లాక్ లభ్యమవుతాయి. ఆడియో అనుభవాన్ని మెరుగుపరచేందుకు Dolby Atmos స్టీరియో స్పీకర్లు అందించారు.
ధరపై ఆసక్తి పెరిగింది
కంపెనీ ఇంకా అధికారిక ధర ప్రకటించకపోయినా, ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం ఈ ఫోన్ ధర రూ.
18,000 – రూ. 22,000 మధ్యలో ఉండే అవకాశముంది.
ఈ ధర రేంజ్‌లో ఇంత పెద్ద బ్యాటరీ Snapdragon 7s Gen 2 ప్రాసెసర్, Sony సెన్సార్ కెమెరా ఇవ్వడం టెక్ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.
మోటోరోలా ఈసారి మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్, కెమెరా క్వాలిటీ, డిజైన్ అన్ని అంశాలను సమతౌల్యంగా కలిపే ప్రయత్నం చేసింది. బ్యాటరీ లైఫ్‌కి ప్రాధాన్యత ఇచ్చే యూజర్లకు ఇది మంచి ఆప్షన్‌గా ఉండొచ్చు.