భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో పనిచేయాలనుకునే యువతకు ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. ఐఎస్ఆర్ఓకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట (SDSC SHAR) వివిధ విభాగాల్లో మొత్తం 141 పోస్టుల భర్తీకి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్ నుండి పదవ తరగతి అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఈ పోస్టులు ఉండటం విశేషం.
ఆసక్తి గల అభ్యర్థులు 2025 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 14, 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇస్రోలో సైంటిస్ట్/ఇంజినీర్ స్థాయి నుండి టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల వరకు ఉద్యోగాలు లభిస్తున్నాయి.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్లో ప్రధానంగా ఆకర్షిస్తున్న పోస్టులు, వాటి ఖాళీల సంఖ్య:141
సైంటిస్ట్/ఇంజినీర్ - SC: 23 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్: 28 పోస్టులు
సైంటిఫిక్ అసిస్టెంట్: 3 పోస్టులు
లైబ్రరీ అసిస్టెంట్ - A: 1 పోస్టు
రేడియోగ్రాఫర్ - A: 1 పోస్టు
టెక్నీషియన్ - B: 70 పోస్టులు (ఇది అత్యధిక ఖాళీలు ఉన్న విభాగం)
డ్రాఫ్ట్స్మెన్ - B: 2 పోస్టులు
కుక్: 3 పోస్టులు
ఫైర్మెన్ - A: 6 పోస్టులు
లైట్ వెహికిల్ డ్రైవర్ - A: 3 పోస్టులు
నర్స్ - B: 1 పోస్టు .
విద్యార్హతలు
సైంటిస్ట్/ఇంజినీర్ - SC: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ నర్స్: డిప్లొమా లేదా బీఎస్సీ అర్హత ఉండాలి.
టెక్నీషియన్ - B డ్రాఫ్ట్స్మెన్ - B: ఐటీఐ (ITI) సర్టిఫికెట్ తప్పనిసరి.
కుక్, డ్రైవర్, ఫైర్మెన్: పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో అనుభవం అవసరం.
వయస్సు పరిమితులు నవంబర్ 14, 2025 నాటికి
సైంటిస్ట్/ఇంజినీర్ - SC పోస్టులకు: 18 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
మిగిలిన పోస్టులకు: 18 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం OBC 3 ఏళ్లు
SC/ST 5 ఏళ్లు, దివ్యాంగులకు (10 ఏళ్లు) వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఆకర్షణీయమైన జీతభత్యాలు:
ఇస్రోలో ఉద్యోగాలు లభిస్తే భారీ జీతాలతో కెరీర్ను కొనసాగించవచ్చు. కేంద్ర ప్రభుత్వ 7వ వేతన కమిషన్ ప్రకారం జీతాలు ఇలా ఉంటాయి:
సైంటిస్ట్/ఇంజినీర్ - SC: నెలకు రూ.56,100 - రూ.1,77,500 వరకు.
టెక్నికల్ అసిస్టెంట్/నర్స్ - B: నెలకు రూ.44,900 - రూ.1,42,400 వరకు.
టెక్నీషియన్ - B/డ్రాఫ్ట్స్మెన్ - B: నెలకు రూ.21,700 - రూ.69,100 వరకు.
కుక్/డ్రైవర్/ఫైర్మెన్ - A: నెలకు రూ.19,900 - రూ.63,200 వరకు.
దరఖాస్తు విధానం & ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులు కేవలం ఆన్లైన్ విధానంలో మాత్రమే SDSC SHAR అధికారిక వెబ్సైట్ https://www.shar.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ పోస్టును బట్టి మారుతుంది.
సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులకు: రాత పరీక్ష, ఇంటర్వ్యూ.
టెక్నికల్/సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్
కుక్, డ్రైవర్, ఫైర్మెన్ పోస్టులకు: ఫిజికల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్.
దరఖాస్తు ఫీజు:
సాధారణ (General)/OBC/EWS అభ్యర్థులకు రూ.500 నుండి రూ.750 వరకు ఫీజు ఉంటుంది.
SC/ST, PwBD (దివ్యాంగులు), Ex-Servicemen అభ్యర్థులకు ఫీజు మినహాయింపు లభించడం గమనార్హం.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో స్థిరపడాలని, దేశ సేవలో భాగం కావాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు శ్రీహరికోట లేదా ఇతర ఇస్రో కేంద్రాల్లో పోస్టింగ్ లభిస్తుంది.