Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం!

TTD Controversy: టీటీడీ ప్రసాదం నుంచి పుస్తకాల వరకు అంతా కల్తీనే: వైసీపీ పాలనపై సాధు పరిషత్ ఆగ్రహం..!!

TTD Laddu Controversy: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పవిత్రతను మంటగలిపారని, భగవద్గీతను అపహాస్యం చేస్తూ రాజకీయ ప్రసంగాలు ముద్రించారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు..

Published : 2026-03-08 19:18:00

TTD Laddu Controversy: తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను గత వైసీపీ ప్రభుత్వం మంటగలిపిందని, హిందూ ధర్మంపై దాడికి తెగబడిందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భగవద్గీత వంటి అత్యంత పవిత్రమైన గ్రంథాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ముద్రించిన భగవద్గీతలో కనీసం ఒక్క శ్లోకం కూడా లేకుండా, కేవలం జగన్ రాజకీయ ప్రసంగాలను ముద్రించడమేంటని ఆయన నిలదీశారు.

గత ఐదేళ్ల పాలనలో టీటీడీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. దేవుడిపై భక్తి, హిందూ ధర్మంపై అవగాహన లేని వ్యక్తులను టీటీడీ ఛైర్మన్లుగా నియమించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటం దగ్గర నుంచి, దర్శనాల వరకు ప్రతి విషయంలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. "కాదేదీ కల్తీకి అనర్హం" అన్నట్లుగా వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయని ఆయన విమర్శించారు.

ముఖ్యంగా ఆధ్యాత్మిక గ్రంథాల ముద్రణ విషయంలో జరిగిన నిర్లక్ష్యం క్షమించరానిదని ఆయన పేర్కొన్నారు. హిందూ సమాజం అంటే జగన్‌కు ఎందుకు అంత చులకన భావమని ఆయన ప్రశ్నించారు. వేరే మత గ్రంథాలను ఇలాగే అవమానిస్తే ఊరుకుంటారా అని నిలదీస్తూ, భగవద్గీతను అపహాస్యం చేసినందుకు జగన్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీని ఒక వ్యాపార సంస్థలా మార్చి, ఉద్యోగుల నియామకాల్లో కూడా రాజకీయాలకు పెద్దపీట వేశారని ఆయన మండిపడ్డారు.

టీటీడీలో జరిగిన అక్రమాలు, హిందూ ధర్మంపై జరిగిన దాడుల గురించి తాము బహిరంగ చర్చకు సిద్ధమని శ్రీనివాసానంద సరస్వతి సవాల్ విసిరారు. వైసీపీ నాయకులు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి చర్చలో పాల్గొంటామని, జరిగిన తప్పులను ఆధారాలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను అపవిత్రం చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ధర్మ రక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

భగవద్గీత ముద్రణలో జరిగిన అపచారంపై తాము ఊరుకోబోమని, ఏపీ సాధు పరిషత్ తరపున పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Spotlight

Read More →