అమెరికా: విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే సేవా భావాన్ని పెంచేందుకు ముందుడుగు వేస్తున్న నాట్స్. ఫిలడెల్ఫియాలో నాట్స్ యూత్ కమిటీ నాయకురాలు అమృత శాఖమూరి ఆధ్వర్యంలో ది సిబీ సౌత్ స్కూల్ యాక్టివిటీస్ కోసం విరాళాలు సేకరించారు. నాట్స్ ద్వారా సేకరించిన 6000 డాలర్ల(సుమారు 5 లక్షల రూపాయలు) విరాళాల చెక్కును నాట్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులు శ్రీధర్ అప్పసాని, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్) హరినాథ్ బుంగటావుల, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వెంకట్ లతో కలిసి అమృత శాఖమూరి, సీబీ సౌత్ హైస్కూల్ ప్రిన్సిపాల్ జాసన్ హెచ్. బుచర్ కి అందించారు. నాట్స్ ఇచ్చిన విరాళం సీబీ సౌత్ కు చాలా సహాయ పడతాయి అని జాసన్ అన్నారు. విద్యార్థుల్లో సేవా భావాన్ని పెంచేలా సీబీ సౌత్ కోసం నాట్స్ చేసిన విరాళాల సేకరణను ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతాయి అని తెలిపారు. నాట్స్ యువ వాలంటీర్లను, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం చేపట్టిన ఈ డోనేషన్ డ్రైవ్ లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేకంగా అభినందించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి