మన శరీరానికి ఇతర పోషకాలంతే ఫైబర్ కూడా చాలా అవసరం. ఇది రెండు రకాలుగా ఉంటుంది సొల్యూబుల్ (ద్రవణీయమైనది) మరియు ఇన్‌సొల్యూబుల్ (ద్రవణీయంకాని).
సొల్యూబుల్ ఫైబర్ నీటిలో కరిగి జెల్‌లా మారుతుంది, ఇది రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్‌సొల్యూబుల్ ఫైబర్ నీటిలో కరగదు, కానీ మలానికి బరువు ఇచ్చి సులభంగా బయటికి రావడంలో సహాయపడుతుంది.
ఫైబర్ గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది, ఎందుకంటే ఇది మన పేగులలో ఉన్న మంచిబాక్టీరియాలకు ఆహారంగా పనిచేస్తుంది. కానీ రోజువారీ ఆహారంలో తగినంత ఫైబర్ తీసుకోకపోతే కొన్ని సమస్యలు తలెత్తుతాయి.
ప్రతి ఒక్కరికీ తెలిసినట్లు మలబద్ధకం ఫైబర్ తక్కువగా ఉన్నప్పుడు వచ్చే సాధారణ సమస్య. ఫైబర్ కొరతకు మొదటి సంకేతం మలబద్ధకం కాదు, భోజనం చేసిన కొద్ది సేపటికే మళ్లీ ఆకలి వేయడం.
జీర్ణ సమస్యలు: మలబద్ధకం, వాయువు, ఉబ్బరం వంటి సమస్యలు.
బరువు పెరగడం: ఫైబర్ తక్కువగా ఉంటే తృప్తి అనిపించదు ఎక్కువ తినడం వల్ల బరువు పెరుగుతారు.
కొలెస్ట్రాల్ పెరగడం: సొల్యూబుల్ ఫైబర్ తక్కువగా తీసుకుంటే హార్ట్ హెల్త్‌పై ప్రభావం ఉంటుంది.
చక్కెర స్థాయిల మార్పులు: ఫైబర్ తక్కువగా ఉంటే రక్తంలో గ్లూకోజ్ ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.
పైల్స్ (హేమరాయిడ్స్): తరచుగా మలబద్ధకం వల్ల పేగు భాగంలో ఒత్తిడి పెరిగి పైల్స్ వస్తాయి.
అలసట: ఫైబర్ తక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా మారి అలసటగా అనిపిస్తుంది.
జంక్‌ఫుడ్ కోరిక: ఫైబర్ తక్కువగా తీసుకుంటే తరచూ అప్రయోజనకరమైన స్నాక్స్ తినాలనిపిస్తుంది.
ఫైబర్‌ను ఎలా సమతుల్యంలో తీసుకోవాలి అంటే
రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, విత్తనాలు, గింజలు, మరియు హోల్ గ్రెయిన్స్ చేర్చాలి.మహిళలు రోజుకు సుమారు 25 గ్రాములు, పురుషులు 38 గ్రాములు ఫైబర్ తీసుకోవాలి.