ఎన్టీఆర్ జిల్లా రెడ్డి గూడెం మండలం పాత నాగులూరు గ్రామానికి చెందిన తులుమేల్లి శారద నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ గ్రామంలో తమకు చెందిన 1 ఎకరా 30 సెంట్ల భూమిని కొందరు కౌలుకు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని వాపోయారు.
తమ తల్లి బుట్ట మంగమ్మ.. పక్క గ్రామమైన రామనపాడు చెందిన కొందరు వ్యక్తులకు ఈ భూమిని కౌలుకు ఇచ్చారన్నారు. ఆమె మరణానంతరం ఆ భూమిని సదరు వ్యక్తులను తిరిగి ఇమ్మనగా భూమి కొనుక్కోమన్నామని బెదిరిస్తున్నారు.
కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు హోమంత్రి వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబులకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి పొట్లూరు పద్మజ రాణి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో దేవస్థానానికి చెందిన సర్వే నెం. 130 లోని 9.50 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. దానిలో 2.20 సెంట్లు భూమిని పొట్లూరి సత్యానారయణ ఆక్రమించుకొని కొత్తపల్లి గ్రామానికి చెందిన వేణు గోపాలచారికి విక్రయించారు. తమకు సత్యనారాయణ నుంచి ప్రాణహాని ఉంది. తమయందు దయవుంచి వారిపై చర్యలు తీసుకోని సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మాచవరంకు చెందిన వీరంకి అనిల్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. నాగరాజు కంతేటి అనే వ్యక్తి కన్స్ లేటెన్సీ నుంచి ఫోన్ చేసి తనకు ఫేక్ ఉద్యోగ నియామకం లేటర్ ఇచ్చి రూ.1,20,000 తీసుకున్నట్లు వివరించారు.
మాచవరం పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అక్కడ తనలాగే చాలా బాధితులు ఫిర్యాదులు చేసినట్లు పోలీసులు తెలిపారన్నారు. దీనిపై ఇది వరకే కేసు నమోదైందని తన పేరు కూడా అందులో అటాచ్ చేస్తామని పోలీసులు తెలిపినట్లు వివరించాడు. ఉద్యోగం కోసం డబ్బులు అప్పుచేసి ఇచ్చాను. కావునా వారిపై చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని కోరారు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.