Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! YSRCP: మడకశిర వైసీపీలో ముదిరిన వర్గ పోరు..! నడిరోడ్డుపైనే నాయకుల భౌతిక దాడులు! Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష! అధికారులకు కీలక ఆదేశాలు! Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! YSRCP: మడకశిర వైసీపీలో ముదిరిన వర్గ పోరు..! నడిరోడ్డుపైనే నాయకుల భౌతిక దాడులు! Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష! అధికారులకు కీలక ఆదేశాలు! Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్!

Agriculture News Telugu: రైతులకు గుడ్ న్యూస్... రాష్ట్రంలోనే అతిపెద్ద ఆయిల్ పామ్ రిఫైనరీ ప్రారంభం!

Telangana Oil Palm: సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ రిఫైనరీని ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీనివల్ల రైతులకు మద్దతు ధర, యువతకు ఉపాధి కలగనుంది.

Published : 2026-03-15 12:10:00

Telangana Oil Palm: తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సిద్దిపేట జిల్లా నర్మెటలో సుమారు 300 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన రాష్ట్రంలోనే అతిపెద్ద ఆయిల్ పామ్ రిఫైనరీ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్లాంట్ ప్రారంభం కానుంది. దీనివల్ల మన రాష్ట్రంలో పండే ఆయిల్ పామ్ గెలల నుంచి నేరుగా వంట నూనెను ఇక్కడే తయారు చేసే అవకాశం కలుగుతుంది. ఇప్పటివరకు మన దగ్గర ముడి చమురును మాత్రమే తీసి, శుద్ధి కోసం వేరే రాష్ట్రాలకు పంపేవారు. కానీ ఇకపై ఆ అవసరం లేకుండా నర్మెటలోనే నూనె తయారీ జరుగుతుంది.

ఈ ప్రాజెక్టు వెనుక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి ఎంతో ఉంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఆయిల్ పామ్ సాగును దృష్టిలో ఉంచుకుని, రైతులకు మేలు చేసేలా సొంతంగా రిఫైనరీ ఉండాలని ఆయన ప్రతిపాదించారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో నర్మెటలో ఈ భారీ ప్లాంట్ సాకారమైంది. మలేషియాకు చెందిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని నిర్మించారు. ఈ ప్లాంట్ ద్వారా గంటకు 30 టన్నుల గెలలను క్రషింగ్ చేసే వీలుంది. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని రోజుకు 600 టన్నుల వరకు పెంచేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఈ రిఫైనరీ కేవలం నూనె తయారీకే పరిమితం కాకుండా, విద్యుత్ ఉత్పత్తిలోనూ స్వయం సమృద్ధి సాధించనుంది. గెలల నుంచి వచ్చే వ్యర్థాలను  ఉపయోగించుకుని విద్యుత్తును తయారు చేసేలా 4 మెగావాట్ల ప్లాంట్‌ను ఇక్కడే ఏర్పాటు చేశారు. అంటే ఫ్యాక్టరీకి కావాల్సిన కరెంటును అక్కడే సొంతంగా తయారు చేసుకుంటారన్నమాట. అలాగే పరిశ్రమకు అవసరమైన నీటి కోసం 10 కోట్ల లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్‌ను కూడా నిర్మించారు. వాడిన నీటిని వృథా చేయకుండా మళ్ళీ రీసైక్లింగ్ పద్ధతిలో వాడుకునేలా ఏర్పాట్లు చేయడం ఈ ప్లాంట్ ప్రత్యేకత.

ఉపాధి విషయంలోనూ ఈ రిఫైనరీ యువతకు పెద్ద పీట వేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా  పరోక్షంగా సుమారు 1000 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక ప్రాంతాల్లో ఉండే యువతకు ఇది ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేవలం ఉద్యోగాలే కాకుండా, రవాణా  ఇతర అనుబంధ రంగాల్లో కూడా చాలా మందికి పని దొరుకుతుంది.

ముఖ్యంగా రైతులకు ఈ రిఫైనరీ వల్ల మార్కెట్లో మంచి మద్దతు ధర లభించనుంది. గతంలో పక్క రాష్ట్రాలకు పంపడం వల్ల అయ్యే ఖర్చులు తగ్గి, ఆ లాభం నేరుగా రైతులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోంది. వీరందరికీ నర్మెట రిఫైనరీ ఒక భరోసాలా నిలవనుంది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఈ రిఫైనరీ పక్కనే మరో భారీ ప్లాంట్‌కు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉండటంతో సిద్దిపేట జిల్లాలో సందడి నెలకొంది.

Spotlight

Read More →