- ముస్లిం మైనారిటీల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత..
- రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఈ ఏడాది బడ్జెట్లో ముస్లింల సంక్షేమానికి రూ. 6,090 కోట్లు కేటాయించాం…
Andhrapradesh Veeranjaneya Swamy: ముస్లిం మైనారిటీల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా మంగళవారం సింగరాయకొండలో ఇఫ్తార్ విందులో మంత్రి డా.స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మంత్రి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ...ముస్లిం మైనారిటీల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఈ ఏడాది బడ్జెట్లో ముస్లింల సంక్షేమానికి రూ. 6,090 కోట్లు కేటాయించాం. ఇమామ్‌లు, మౌజామ్‌లకు గౌరవ వేతనాలు పెండింగ్ బకాయిలు రూ.45 కోట్లు నేడు విడుదల చేశాం. ఉర్దూ ఘర్, షాదీఖానాల నిర్మాణాలకు రూ. 2.85 కోట్లు మంజూరు చేశాం. అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వక్స్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాం. హజ్ యాత్రకు వెళ్ళే పేద ముస్లింలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాల అండగా ఉన్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.