Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు!

Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు!

2025-11-06 09:34:00
Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తూ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిపాలన సమర్థతను పెంపొందించేందుకు యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్యపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, విద్యా రంగంలో పారదర్శకత, సమన్వయం, నైపుణ్యాభివృద్ధి ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.

Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!!

మంత్రి మాట్లాడుతూ, ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు నాలుగేళ్ల పాటు చదివినా ఉద్యోగావకాశాలు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో, హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో నాలుగు నెలల కోచింగ్‌తో విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారని ఉదాహరణగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య పాఠ్యప్రణాళికలో మార్పులు అవసరమని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ లోపల ఐటీఐలు, యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీలను పరిశ్రమలతో అనుసంధానించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు!

ప్రైవేట్ కాలేజీలను కూడా నైపుణ్య పోర్టల్ తో సంధానం చేసి, విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లకు గ్యారంటీ ఇవ్వాలని లోకేష్ సూచించారు. అదేవిధంగా కళాశాలల్లో ముఖ ఆధారిత హాజరు వ్యవస్థను తప్పనిసరి చేయాలని తెలిపారు. కేజీ నుండి పీజీ వరకు విద్యార్థుల ప్రగతిని గుర్తించేందుకు స్టూడెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఇది విద్యా నాణ్యత పెంపుకు దోహదం చేస్తుందని అన్నారు.

ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు!

అదనంగా, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడం, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుపరచడం, సమర్ధ్ మరియు ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థుల 100 శాతం ప్రాంగణ నియామకాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. యూనివర్సిటీల్లో స్టూడెంట్ ఫీడ్‌బ్యాక్ మెకానిజంను ఏర్పాటు చేయడం ద్వారా విద్యా నాణ్యతను అంచనా వేయవచ్చని అన్నారు.

Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..!

చివరగా, ఇంటర్మీడియట్ విద్యా రంగంలో ఉత్తీర్ణతా శాతం పెంపు కోసం కొత్త చర్యలు చేపట్టాలని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇంటర్ విద్యలో సంస్కరణల అమలు, వృత్తి విద్యా కోర్సుల ట్రాకింగ్ వంటి అంశాలను పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. ప్రైవేట్ కాలేజీల అనుమతులకు కాలపరిమితి విధించడం అవసరమని అన్నారు. మొత్తం మీద, విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రమాణాలు కొత్త దిశలో నడుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం!
Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా.....
Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52!
Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్!
Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు!

Spotlight

Read More →