Nara Lokesh: రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో, లేదో త్వరలో - ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నారా లోకేష్ Minister Savita: బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బందికి మంత్రి సవిత ఆదేశం! కన్న బిడ్డల్లా హాస్టళ్ల విద్యార్థులను ఆదరించండి.. Kolusu Parthasarathy: బాపట్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పెషల్ ఫోకస్.. AP Govt Jobs: వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు..!! Women Empowerment: అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్... వేసవి సెలవులు పెంపు.. 5G ఫోన్ల పంపిణీతో హైటెక్ సేవలు! Chandrababu: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోకో సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు ప్రకటన.!! SAPChairman: వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు....!! Botsa Satyanarayana: వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..! హైదరాబాద్‌కు తరలింపు! Payyavula Keshav: చైర్మన్ వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్.. ఆ ప్రకటన అబద్ధమెలా అవుతుంది? Chandrababu: విజయనగరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రేపు రావివలసలో ఇంటింటికీ పింఛన్లు! Nara Lokesh: రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో, లేదో త్వరలో - ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నారా లోకేష్ Minister Savita: బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బందికి మంత్రి సవిత ఆదేశం! కన్న బిడ్డల్లా హాస్టళ్ల విద్యార్థులను ఆదరించండి.. Kolusu Parthasarathy: బాపట్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పెషల్ ఫోకస్.. AP Govt Jobs: వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు..!! Women Empowerment: అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్... వేసవి సెలవులు పెంపు.. 5G ఫోన్ల పంపిణీతో హైటెక్ సేవలు! Chandrababu: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోకో సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు ప్రకటన.!! SAPChairman: వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు....!! Botsa Satyanarayana: వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..! హైదరాబాద్‌కు తరలింపు! Payyavula Keshav: చైర్మన్ వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్.. ఆ ప్రకటన అబద్ధమెలా అవుతుంది? Chandrababu: విజయనగరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రేపు రావివలసలో ఇంటింటికీ పింఛన్లు!

Varla Ramaiah: గౌరవ సీఎం గారిపై వైసీపీ వారు పెట్టిన అసభ్యకరమైన పోస్టుపై డీజీకి ఫిర్యాదు!

Varla Ramaiah comments on ycp: 2024 ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించి 11 సీట్లకే పరిమితం చేసినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రాలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. అధికారం పోవడంతో జగన్ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని, నిద్ర ఆహారాలు మాని ఏ రకంగానైనా చంద్రబాబు గారిని దించి మళ్ళీ సీఎం కుర్చీ ఎక్కాలని అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన విమర్శించారు.

Published : 2026-02-27 21:00:00
  • టీడీపీ నేతల మీడియా స‌మావేశం..
     
  • ప్రజలు ఘోరంగా ఓడించి 11 సీట్లకే పరిమితం చేసినా..
     

Varla Ramaiah comments on ycp: 2024 ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించి 11 సీట్లకే పరిమితం చేసినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రాలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. అధికారం పోవడంతో జగన్ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని, నిద్ర ఆహారాలు మాని ఏ రకంగానైనా చంద్రబాబు గారిని దించి మళ్ళీ సీఎం కుర్చీ ఎక్కాలని అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన విమర్శించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డి కలిసి ఈ 'క్రిమినల్ కాన్స్పిరసీ'కి తెరలేపారు. 

ఈ కుట్రలో భాగంగానే "ఎఫ్‌స్టీన్ ఫైల్స్" (Epstein Files) తరహాలో చంద్రబాబు గారి పేరును అప్రతిష్ట పాలు చేసేలా ఒక దారుణమైన పోస్టును సృష్టించారని ఆరోపించారు. దామురెడ్డి" అనే వ్యక్తి ద్వారా సోషల్ మీడియాలో ఒక తప్పుడు పోస్ట్‌ను సర్క్యులేట్ చేస్తున్నారు. అందులో చంద్రబాబు గారి ఫోటోను పెట్టి, అది ఏదో FBI క్లాసిఫైడ్ (FBI Classified), కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ అన్నట్లుగా చిత్రీకరించడం అత్యంత దుర్మార్గమన్నారు. అసలు ఉనికిలో లేని ఒక తప్పుడు కేసు నంబర్‌ను సృష్టించి, చంద్రబాబు గారిని ఒక 'హై ప్రొఫైల్ అనుమానితుడి'గా చూపించే ప్రయత్నం చేశారు. ఇది కేవలం ఒక పోస్ట్ మాత్రమే కాదు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఒక నాయకుడి ఔన్నత్యాన్ని తగ్గించాలని చూస్తున్న క్రిమినల్ కాన్స్పిరసీ.  దాము రెడ్డి అనే వ్యక్తి ద్వారా అత్యంత జుగుప్సాకరమైన పోస్టులు పెట్టించి, సమాజంలో కులాలు, మతాలు, పార్టీల మధ్య వైషమ్యాలు రేకెత్తించాలని చూస్తున్నారని విమర్శించారు. 

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, అలజడి సృష్టించడమే వీరి ఏకైక లక్ష్యం. పరస్త్రీలను గౌరవించడంలో చంద్రబాబు నాయుడు గారి సంస్కారం ఎలాంటిదో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన మీద ఇటువంటి అశ్లీలమైన, అసభ్యకరమైన ఆరోపణలు చేయడం అంటే సూర్యుడి మీద ఉమ్మి వేయడమే. ఆ ఉమ్మి తిరిగి మీ ముఖం మీదనే పడుతుందని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. చంద్రబాబు గారిపై అశ్లీలమైన, అనైతికమైన పోస్టులు పెట్టడం నీతిమాలిన కుక్కలు చేసే పని కంటే హీనంగా ఉంది. అసలు ఇటువంటి దరిద్రపు పోస్టులను ప్రజలు నమ్ముతారని ఎలా అనుకుంటున్నారు? జగన్ గారూ.. ఇప్పటికైనా మీ పంథా మార్చుకోండి, ప్రజల ఆమోదం పొందడం నేర్చుకోండి. దీనిపై మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్, వంశీలతో కలసీ సీఐడీ డీజీకి ఫిర్యాదు చేశాం. మేము ఇచ్చిన పోస్ట్ కాపీలు చూసి సీఐడీ డిజీ గారు కూడా దిగ్భ్రాంతి చెందారు.  వైకాపా వాళ్ళు ఇంత నీచంగా మాట్లాడతారా?" అని ఆయన ఆశ్చర్యపోయారు. అంబటి రాంబాబు వంటి వారు వాడే బూతు పురాణానికి కొనసాగింపే ఈ సోషల్ మీడియా దాడులు. ఈ నీచమైన పోస్టుల వెనుక జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు సజ్జల భార్గవ రెడ్డిల హస్తం ఉంది. 

ఇది స్పష్టమైన 'క్రిమినల్ కాన్స్పిరసీ'. వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచి, రాష్ట్రంలో అలజడి సృష్టించి, తద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కూటమి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని వీరు ప్లాన్ చేశారు. దాము రెడ్డి అనే వ్యక్తికి, సజ్జల భార్గవ రెడ్డికి ఉన్న సంబంధాలు, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలపై కూలంకషంగా దర్యాప్తు చేయాలని కోరాం. నిందితులు ఎంతటి వారైనా, ఎంత డబ్బున్న వారైనా సరే అరెస్ట్ చేసి చట్టబద్ధంగా శిక్షించాలని డిమాండ్ చేశాం. దీనిపై డిజీ గారు సానుకూలంగా స్పందించి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. "ఇప్పటికైనా ఇటువంటి దరిద్రపు ఆలోచనలు మానుకో జగన్. నీ నీచ బుద్ధి, మీ టీమ్ దుర్మార్గపు ఆలోచనలు ప్రజలందరికీ అర్థమైపోయాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, త్వరలోనే మీ కుట్రలన్నింటికీ మూల్యం చెల్లించుకోక తప్పదని వర్ల రామయ్య హెచ్చరించారు.

అనంతరం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల చేత ఛీత్కరించబడిన వైఎస్సార్సీపీ, తన రాజకీయ మనుగడ కోసం అత్యంత నీచమైన, వికృత చేష్టలకు పాల్పడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎటువంటి సిద్ధాంతాలు లేని ఆ పార్టీ, కేవలం ప్రజల మధ్య విద్వేషాలు రగిలించి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వైఎస్సార్సీపీ 'సైకో సైన్యం' సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా జరిగిన ఏదో అంశాన్ని (ఎప్స్టీన్ కేసు వంటివి) మార్ఫింగ్ చేసి, ముఖ్యమంత్రి గారికి ఆపాదించడం జగన్ మోహన్ రెడ్డి గారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతుంటే వాటిని చర్చకు రాకుండా చేసేందుకే ఇటువంటి 'చౌకబారు' విమర్శలు, బూతుల సంస్కృతిని వైఎస్సార్సీపీ ప్రోత్సహిస్తోంది. 

సజ్జల రామకృష్ణ రెడ్డి కుమారుడు భార్గవ రెడ్డి నేతృత్వంలో సోషల్ మీడియా వింగ్ ద్వారా విష ప్రచారం సాగుతోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వేధించిన వీరు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా తమ పద్ధతి మార్చుకోకపోవడం విచారకరం. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న పార్టీగా మేము పోలీసు వ్యవస్థను ఆశ్రయించాం. ఈ కుట్రల వెనుక ఉన్న వారిని, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని వర్ల రామయ్య గారి నాయకత్వంలో సీఐడీ డీజీకి ఫిర్యాదు చేశాం. జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఇటువంటి కుట్రలను, అవాస్తవాలను రాష్ట్ర ప్రజలు గమనించాలని, మీడియా కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్, బండారు వంశీకృష్ణ పాల్గొన్నారు.

Spotlight

Read More →