Praja Vedika: అదృశ్యమవుతున్న భూములు.. తెరవెనుక అసలు సూత్రధారులు ఎవరు? గ్రీవెన్స్‌లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amrit Bharat Station Scheme: అమృత్ భారత్ పథకంలో పిఠాపురం.. కార్పొరేట్ లుక్‌లో మెరిసిపోనున్న స్టేషన్! APUrban Development: చిత్తూరుకు మహర్దశ... మంత్రి నారాయణ సమీక్షలో వెల్లడైన కీలక అభివృద్ధి ప్రణాళికలు..!! Telangana Welfare Schemes: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే 'తులం బంగారం' పథకం అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన..!! Amaravati Legality Bill: ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతం - నేడే రాష్ట్రపతి ఆమోద ముద్ర..! Kandula Durgesh: సేవా పథంలో అక్కడ సరికొత్త రికార్డు.. 21 నెలల్లో 781 మందికి రూ.5.66 కోట్ల లబ్ధి! AP Govt Employees: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు క్లాస్.. 'సూపర్ అచీవర్స్'కు అదిరిపోయే ఆఫర్! Home Minister Anita: చల్లపల్లి పేలుడు ఘటనపై హోం మంత్రి సమీక్ష.. ధైర్యంగా ఉండండి.. మేమున్నాం.! Atchannaidu: రూ. 4,360 కోట్లతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మార్పు.. పోర్టు నిర్మాణ పనుల క్షేత్రస్థాయి పరిశీలన.. Minister Gottipati: మే 15 నాటికి పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ సిద్ధం.. అధికారులకు మంత్రి గొట్టిపాటి డెడ్ లైన్! Praja Vedika: అదృశ్యమవుతున్న భూములు.. తెరవెనుక అసలు సూత్రధారులు ఎవరు? గ్రీవెన్స్‌లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amrit Bharat Station Scheme: అమృత్ భారత్ పథకంలో పిఠాపురం.. కార్పొరేట్ లుక్‌లో మెరిసిపోనున్న స్టేషన్! APUrban Development: చిత్తూరుకు మహర్దశ... మంత్రి నారాయణ సమీక్షలో వెల్లడైన కీలక అభివృద్ధి ప్రణాళికలు..!! Telangana Welfare Schemes: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే 'తులం బంగారం' పథకం అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన..!! Amaravati Legality Bill: ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతం - నేడే రాష్ట్రపతి ఆమోద ముద్ర..! Kandula Durgesh: సేవా పథంలో అక్కడ సరికొత్త రికార్డు.. 21 నెలల్లో 781 మందికి రూ.5.66 కోట్ల లబ్ధి! AP Govt Employees: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు క్లాస్.. 'సూపర్ అచీవర్స్'కు అదిరిపోయే ఆఫర్! Home Minister Anita: చల్లపల్లి పేలుడు ఘటనపై హోం మంత్రి సమీక్ష.. ధైర్యంగా ఉండండి.. మేమున్నాం.! Atchannaidu: రూ. 4,360 కోట్లతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మార్పు.. పోర్టు నిర్మాణ పనుల క్షేత్రస్థాయి పరిశీలన.. Minister Gottipati: మే 15 నాటికి పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ సిద్ధం.. అధికారులకు మంత్రి గొట్టిపాటి డెడ్ లైన్!

Basara Saraswati Temple: ఎన్నికల వరకే రాజకీయం.. ఆపై అందరం కలిసి పని చేయాల్సిందే రేవంత్ రెడ్డి పిలుపు..!

Basara Saraswati Temple: ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రూ. 225 కోట్లతో బాసర ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండకూడదని, అందరం కలిసి అభివృద్ధి కోసం పని చేయాలని పిప్రి సభలో ఆయన పిలుపునిచ్చారు

Published : 2026-04-06 20:42:00

Pipri Public Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం భూమిపూజ చేశారు. సుమారు రూ. 225 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు  ప్రకటించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

ఈ సభలో రేవంత్ రెడ్డి రాజకీయాల కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని  చెప్పారు. ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు ఉండాలి, ఆ తర్వాత అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమకు కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని, వారు ఎప్పటికీ శత్రువులు కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. గత ప్రభుత్వాల హయాంలో విపక్ష నేతలు పర్యటనలకు వస్తే అరెస్టులు చేసే సంస్కృతి ఉండేదని, కానీ తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ గౌరవం ఇస్తుందని  గుర్తు చేశారు.

పిప్రి గ్రామానికి ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తూ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ పాదయాత్రకు నేటితో మూడేళ్లు పూర్తవ్వడం సంతోషంగా ఉందన్నారు. నాడు పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను కళ్లారా చూశామని, అందుకే ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా ఈ ప్రాంతంలో విద్య, వైద్య సౌకర్యాలు సరిగ్గా అందలేదని, దానికి పాత ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని  విమర్శించారు.

జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలను ఆదుకుంటామని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా తమ దృష్టికి ఏవైనా సమస్యలు తీసుకువస్తే, వాటిని రాజకీయ కోణంలో చూడకుండా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. నాయకుడిపై ప్రజలకు నమ్మకం ఉన్నప్పుడే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, నమ్మకాన్ని కాపాడుకుంటామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

 రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులపై కూడా ఆయన స్పందించారు. అకాల వర్షాలు, తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడటమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు  పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. సీఎం రాకతో ఆదిలాబాద్‌ జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది.

Spotlight

Read More →