Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!!

Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో..

Chandrababu: రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు అందించే ప్రతీ సేవను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని సేవలను 'మన మిత్ర' వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకువస్తే, ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుందని ఆయన స్పష్టం చేశారు.

Published : 2026-04-29 21:59:00
  • శాటిలైట్ సమాచారాన్ని ఆర్టీజీఎస్‌కు అనుసంధానించి వేగంగా స్పందించేలా చర్యలు..
     
  • Politics: కర్నూలు డ్రోన్ సిటీ తొలి దశ పనులను జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశం..

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు అందించే సేవలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి నూటికి నూరు శాతం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సాంకేతికతను సామాన్యుడి దరికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా 'మన మిత్ర' వాట్సప్ గవర్నెన్స్ వేదికను మరింత బలోపేతం చేయాలని, ప్రజలు చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్క పౌరుడు తన చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే ప్రభుత్వ సేవలను సులభంగా పొందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ పనితీరును అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇప్పటికే 1,035 రకాల సేవలను అందిస్తున్నామని, ఈ విధానం అందుబాటులోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54 లక్షల మంది పౌరులు 1.78 కోట్ల సేవలను వినియోగించుకున్నారని వెల్లడించారు. ఈ డిజిటల్ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ఇప్పటివరకు 24 లక్షల మందికి పైగా పౌరులకు వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ఎలా పొందాలో క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ గణాంకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, డిజిటల్ విప్లవంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు.

పాలనలో పారదర్శకతను పెంచేందుకు ఆర్టీజీఎస్ ఒక శక్తివంతమైన ఆయుధమని, దీన్ని అన్ని ప్రభుత్వ విభాగాలతో అనుసంధానం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. కేవలం సేవలను ఆన్‌లైన్ చేయడమే కాకుండా, అవి ఎంత వేగంగా ప్రజలకు అందుతున్నాయనే అంశంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. డిసెంబర్ నాటికి ప్రతి ప్రభుత్వ శాఖ తన సేవలను డిజిటలైజ్ చేయాలని, ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఆర్టీజీఎస్ విభాగం అందించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, అవినీతి రహిత పాలనను అందించడానికి ఈ డిజిటల్ గవర్నెన్స్ ఎంతో దోహదపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

శరవేగంగా డ్రోన్ సిటీ.. జూలైకి తొలి దశ పూర్తి చేయాలి
కర్నూలు జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డ్రోన్ సిటీ మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇప్పటికే డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ ఖరారైందని, ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన 8 కంపెనీలకు భూముల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మే నెల రెండో వారంలో ఈ కంపెనీలు తమ నిర్మాణ పనులను ప్రారంభించనున్నాయని వివరించారు. 

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, డ్రోన్ సిటీ మొదటి దశ పనులను ఈ ఏడాది జూలై నాటికి కచ్చితంగా పూర్తి చేయాలని గడువు విధించారు. ఇది రాష్ట్రానికి టెక్నాలజీ రంగంలో గర్వకారణంగా నిలుస్తుందని ఆకాంక్షించారు.

నేర నియంత్రణ, శాటిలైట్ డేటా వినియోగంపై దృష్టి
రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోందని అధికారులు తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి పర్యవేక్షణ అత్యుత్తమంగా ఉందని, దీని ఫలితంగా నేరాలను నియంత్రించడం, నేరస్తులను గుర్తించడం, మిస్సింగ్ కేసులు, వాహనాల దొంగతనాల వంటివి వేగంగా పరిష్కారం అవుతున్నాయని వివరించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ కెమెరాలతో పాటు, సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు ఏర్పాటు చేసుకున్న కెమెరాల డేటాను కూడా ప్రభుత్వ వ్యవస్థతో ఇంటిగ్రేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

అదేవిధంగా, శాటిలైట్ డేటాను ఆర్టీజీఎస్‌కు అనుసంధానించి, విపత్తులు లేదా అత్యవసర పరిస్థితులను ముందుగానే పసిగట్టి, వేగంగా స్పందించేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఇటీవల శేషాచల అడవుల్లో జరిగిన అగ్నిప్రమాదాన్ని ప్రస్తావిస్తూ, శాటిలైట్ సమాచారం ఉండి ఉంటే మరింత వేగంగా స్పందించే అవకాశం ఉండేదన్నారు. 

అలాగే, ఇటీవల తలెత్తిన ఇంధన సరఫరా సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించిందని, అయితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకముందే రియల్ టైమ్‌లో గుర్తించి, నివారించే దిశగా సాంకేతికతను వాడుకోవాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Spotlight

Read More →