Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Modi Phone Call: పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా.. అసలు ఏం జరిగిందంటే.! DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.... 2 శాతం పెరిగిన డిఏ (DA)! Sea-Plane: విశాఖ టు పాడేరు కేవలం 20 నిమిషాలే.. సీప్లేన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!! PM Modi: ఈ రోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం!! Delimitation: డీలిమిటేషన్ వెనుక బీజేపీ పెద్ద కుట్ర! ప్రియాంకా గాంధీ సంచలన ఆరోపణలు..! Chandrababu: నిడదవోలులో బాబు నిరసన గళం.. మహిళా బిల్లుపై విపక్షాల తీరుకు వ్యతిరేకంగా ర్యాలీ! Prakash Raj: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. నోటీసులు జారీ చేసిన న్యాయవాదులు! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. 72 గంటల్లోనే లోన్! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Modi Phone Call: పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా.. అసలు ఏం జరిగిందంటే.! DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.... 2 శాతం పెరిగిన డిఏ (DA)! Sea-Plane: విశాఖ టు పాడేరు కేవలం 20 నిమిషాలే.. సీప్లేన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!! PM Modi: ఈ రోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం!! Delimitation: డీలిమిటేషన్ వెనుక బీజేపీ పెద్ద కుట్ర! ప్రియాంకా గాంధీ సంచలన ఆరోపణలు..! Chandrababu: నిడదవోలులో బాబు నిరసన గళం.. మహిళా బిల్లుపై విపక్షాల తీరుకు వ్యతిరేకంగా ర్యాలీ! Prakash Raj: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. నోటీసులు జారీ చేసిన న్యాయవాదులు! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. 72 గంటల్లోనే లోన్!

TN Assembly Election: తమిళనాడు ఎన్నికల బరిలో విజయ్.. రెండు నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు ఇవే.!

Vijay Political Entry: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లోని రాజకీయ సమీకరణాలు. ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి ఎదురవుతున్న పోటీ, నియోజకవర్గాల్లోని ఓటర్ల నాడిపై ఏ విధంగా ఉండనుంది..

Published : 2026-04-11 09:22:00

Vijay Political Entry: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ చిత్రం రసవత్తరంగా మారింది. వెండితెరపై తిరుగులేని 'దళపతి'గా వెలిగిన విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ ఈసారి ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ముఖ్యంగా విజయ్ స్వయంగా పోటీ చేస్తున్న పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాలపై అందరి దృష్టి నెలకొంది. ఈ రెండు చోట్లా గెలవడం విజయ్‌కు పూలబాటేమీ కాదు, అక్కడ బలమైన ప్రత్యర్థులు ఉండటమే దీనికి ప్రధాన కారణం.

పెరంబూర్ విషయానికి వస్తే, ఇది మొదటి నుంచీ డీఎంకే  పార్టీకి కంచుకోట లాంటిది. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ఇది ఆనుకుని ఉండటం వల్ల, ఇక్కడ అధికార పార్టీ ప్రభావం చాలా బలంగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శేఖర్ మరోసారి బరిలో ఉండటం విజయ్‌కు సవాల్‌గా మారింది. అయితే, కొత్త ఓటర్లు  యువతలో విజయ్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ ఇక్కడ ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. డీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంకును చీల్చగలిగితేనే పెరంబూర్‌లో విజయ్ జెండా పాతగలరు.

మరోవైపు తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. ఇక్కడ పట్టణ ఓటర్లతో పాటు మైనారిటీ ఓట్లు గెలుపోటములను శాసిస్తాయి. డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ గతంలో భారీ మెజారిటీతో గెలిచిన నేపథ్యం ఉంది. అలాగే అన్నాడీఎంకే కూడా ఇక్కడ బలంగానే ఉంది. ఈ త్రిముఖ పోటీలో విజయ్ తనదైన ముద్ర వేయాల్సి ఉంటుంది. సుమారు 36 శాతం ఉన్న మైనారిటీ ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారనే అంశంపైనే దళపతి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

విజయ్ తన ప్రచారంలో మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి వంటి హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. సినిమాల్లో ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ ఓట్లుగా మారుతుందా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. సంస్థాగతంగా బూత్ లెవల్ క్యాడర్ లేకపోవడం టీవీకేకు ఉన్న అతిపెద్ద లోపం. ప్రత్యర్థి పార్టీలకు గ్రామ స్థాయి నుంచి బలమైన నెట్‌వర్క్ ఉండటంతో, దాన్ని విజయ్ అభిమాన సంఘాలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.

ఏది ఏమైనా ఒకప్పుడు ఎంజీఆర్, జయలలిత వంటి వారు రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన చరిత్ర తమిళనాట ఉంది. ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. అభిమానాన్ని ఓట్లుగా మలచుకుని, దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను ఆయన సవాల్ చేయగలిగితే, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైనట్టే. ఫలితాలు వచ్చే వరకు దళపతి 'రాజకీయ సినిమా' క్లైమాక్స్ సస్పెన్స్‌గానే ఉండనుంది.

Spotlight

Read More →