డాక్టర్‌గా ఎదిగే ప్రయాణం వరకు పూర్తి అవగాహన..
సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు..
అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా తమ 55వ వార్షికోత్సవం (ఎమరాల్డ్ జూబ్లీ) సందర్భంగా వైద్య విద్యార్థుల కోసం ప్రత్యేక ఉచిత వెబినార్‌ను నిర్వహిస్తోంది. “MD vs DO: Your Journey to Becoming a Doctor” అనే అంశంపై ఈ ఆన్‌లైన్ కార్యక్రమం మే 17న జరగనుంది.
వైద్య రంగంలో కెరీర్ చేయాలనుకునే విద్యార్థులకు అల్లోపతి మెడిసిన్ (MD), ఆస్టియోపతిక్ మెడిసిన్ (DO) మధ్య ఉన్న తేడాలు, మెడికల్ స్కూల్‌లో అడ్మిషన్ నుంచి డాక్టర్‌గా ఎదిగే ప్రయాణం వరకు పూర్తి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.
ఈ వెబినార్‌లో వైద్య విద్యలో అనుభవం కలిగిన ఇద్దరు నిపుణులు విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకోనున్నారు. అమూల్య కులకర్ణి, దీక్ష పానుగంటి పాల్గొని మెడికల్ విద్యకు సంబంధించిన సందేహాలకు సమాధానాలు ఇవ్వనున్నారు.
కార్యక్రమం మే 17, 2026 ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు (PST) జూమ్ ద్వారా నిర్వహించబడుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు చిత్రంలో ఇచ్చిన QR కోడ్ లేదా లింక్ ద్వారా కార్యక్రమంలో పాల్గొనవచ్చని టాస్క్ ప్రతినిధులు తెలిపారు.
మరింత సమాచారం కోసం టాస్క్ చైర్ వెంకట్ పేయాల (310-427-0335), కో-చైర్ రాధ ఉప్పలపాటి (949-331-3275)లను సంప్రదించవచ్చని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టాస్క్ కార్యవర్గ సభ్యులు కోరుతున్నారు.