TAL: యూకేలో ఘనంగా TAL బాడ్మింటన్ టోర్నమెంట్ 2026! Mahanadu: వర్జినియాలో ఘనంగా మినీ మహానాడు వేడుకలు.. చంద్రబాబు దూరదృష్టి, లోకేష్ కొత్త నాయకత్వంపై ప్రశంసలు! NATS: అమెరికాలో ఘనంగా నాట్స్ సాంస్కృతిక సంబరాలు.. తెలుగు వైభవాన్ని ప్రతిబింబించిన ప్రవాస తెలుగు మహాసభ! WhiteHouse Shooting: ట్రంప్ టార్గెట్‌గా కాల్పులతో దద్దరిల్లిన వైట్ హౌస్.... 30 నిమిషాల పాటు 30 రౌండ్లు..!! Australia: ఆస్ట్రేలియాలో ఘనంగా “మహానాడు కనెక్ట్ 2026” కార్యక్రమం! Telugu Badi: నెబ్రాస్కాలో ఘనంగా తెలుగు బడి వార్షికోత్సవం, గ్రాడ్యుయేషన్ వేడుకలు! TASA: టెక్సాస్‌లో ఘనంగా శ్రీ అన్నమాచార్య జయంతి ఉత్సవాలు! TASA ఆధ్వర్యంలో.. TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేద విజ్ఞాన సదస్సు! NATS: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం! TAJA: అమెరికాలో వెలుగొందిన తెలుగు సంస్కృతి! జాక్సన్‌విల్లేలో ఘనంగా ‘తాజా’ ఉగాది వేడుకలు!    TAL: యూకేలో ఘనంగా TAL బాడ్మింటన్ టోర్నమెంట్ 2026! Mahanadu: వర్జినియాలో ఘనంగా మినీ మహానాడు వేడుకలు.. చంద్రబాబు దూరదృష్టి, లోకేష్ కొత్త నాయకత్వంపై ప్రశంసలు! NATS: అమెరికాలో ఘనంగా నాట్స్ సాంస్కృతిక సంబరాలు.. తెలుగు వైభవాన్ని ప్రతిబింబించిన ప్రవాస తెలుగు మహాసభ! WhiteHouse Shooting: ట్రంప్ టార్గెట్‌గా కాల్పులతో దద్దరిల్లిన వైట్ హౌస్.... 30 నిమిషాల పాటు 30 రౌండ్లు..!! Australia: ఆస్ట్రేలియాలో ఘనంగా “మహానాడు కనెక్ట్ 2026” కార్యక్రమం! Telugu Badi: నెబ్రాస్కాలో ఘనంగా తెలుగు బడి వార్షికోత్సవం, గ్రాడ్యుయేషన్ వేడుకలు! TASA: టెక్సాస్‌లో ఘనంగా శ్రీ అన్నమాచార్య జయంతి ఉత్సవాలు! TASA ఆధ్వర్యంలో.. TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేద విజ్ఞాన సదస్సు! NATS: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం! TAJA: అమెరికాలో వెలుగొందిన తెలుగు సంస్కృతి! జాక్సన్‌విల్లేలో ఘనంగా ‘తాజా’ ఉగాది వేడుకలు!   

GTA: జీటీఏ షార్లెట్ చాప్టర్‌కు కొత్త కార్యవర్గం.. తెలంగాణ సమాజ సేవే లక్ష్యమని నేతల వెల్లడి!

GTA: అమెరికాలో తెలంగాణ వాసులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ ప్రవాస తెలంగాణ సంస్థ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తన షార్లెట్ చాప్టర్‌కు నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది.

Published : 2026-05-10 11:23:00

సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్..

షార్లెట్ చాప్టర్‌కు నూతన కార్యవర్గం..

అమెరికాలో తెలంగాణ వాసులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ ప్రవాస తెలంగాణ సంస్థ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తన షార్లెట్ చాప్టర్‌కు నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. సంస్థ వ్యవస్థాపకులు, అడ్వైజరీ చైర్ విశ్వేశ్వర కాలవల, గ్లోబల్ చైర్మన్ ప్రవీణ్ కేసిరెడ్డి, ప్రెసిడెంట్ బాపు ఆర్ కేతిరెడ్డి మార్గదర్శకత్వంలో ఈ కమిటీని ఎంపిక చేశారు.

షార్లెట్ చాప్టర్ అధ్యక్షుడిగా శ్రీకర్ నాగుల బాధ్యతలు చేపట్టారు. వైస్ ప్రెసిడెంట్‌గా ప్రదీప్ వెన్నమనేని, జనరల్ సెక్రటరీగా భరత్ కంభం, జాయింట్ సెక్రటరీగా సాయి కిరణ్ నాయక్ నియమితులయ్యారు. అలాగే ట్రెజరర్‌గా రాజేందర్ చీటి, జాయింట్ ట్రెజరర్‌గా శ్రీనివాస్ మాదలపల్లి బాధ్యతలు స్వీకరించారు.

విభిన్న విభాగాలకు కూడా కొత్త నాయకత్వాన్ని ప్రకటించారు. సాంస్కృతిక విభాగం చైర్‌గా ప్రియాంక కోదాటి, మీడియా విభాగం చైర్‌గా మౌనిక కొక్కిరాల, మార్కెటింగ్ విభాగం చైర్‌గా రవీందర్ కొనకటి, స్పోర్ట్స్ విభాగం చైర్‌గా శ్రీనాధ్ గద్దె నియమితులయ్యారు. మరికొందరు సభ్యులు కూడా వివిధ కమిటీలకు నాయకత్వం వహించనున్నారు.

అలాగే సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వంశీ కేసిరెడ్డి, నర్సింగ్ పద్మ, రాజ్ పందిరి సభ్యులుగా షార్లెట్ అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, షార్లెట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ కుటుంబాలను మరింత దగ్గర చేయడంతో పాటు, సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోనూ తదుపరి తరాలకు చేరవేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

Spotlight

Read More →